IND vs AUS : ఐదు రోజుల మ్యాచ్.. రెండన్నర రోజుల్లోనే

IND vs AUS : ఐదు రోజుల మ్యాచ్.. రెండన్నర రోజుల్లోనే

ఇండోర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్ స్పిన్ ముందు రెండు రోజుల్లోనే చాప చుట్టేసింది. ఇండోర్ గడ్డపై గెలిచిన మొదటి విదేశీ జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 34 ఓవర్లలోనే 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లు తబబడ్డ పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడారు. దాంతో మొదటి ఇన్నింగ్స్ లో 88 పరుగుల లీడ్ తో 197 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో రోజు మొదటి సెషన్ లోనే రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ అందొచ్చిన అవకాశాన్ని జార విడిచింది.

నాథన్ లియాన్ స్పిన్ మాయా జాలానికి టీమిండియా బ్యాటర్లు నిలవలేక పోయారు. కేవలం 61 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భారత్ నిర్ధేశించిన 75 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సింపుల్ గా చేదించింది. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో నాలుగు మ్యాచుల సిరీస్ ను 2-1తో సిరీస్ రేసులో నిలిచింది. 

పుజారా ఒక్కడే..

రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. బంతి ఎక్కడి నుంచి టర్న్ అవుతుందో తెలియక చేతులుత్తేశారు. పుజారా (59)  మినహా ఏ భారత బ్యాట్స్ మెన్ 30 పరుగులు కూడా చేయలేదు. మొదటి ఇన్నింగ్స్ లో నూ అంతే ఏ బ్యాట్స్ మెన్ కూడా కనీసం 25 పరుగులు కూడా చేయకుండా పెవిలియన్ బాట పట్టారు. ఈ మ్యాచ్ విజయంతో ఆసీస్ మొదటి రెండు మ్యాచులు ఓడిపోయినందుకు ప్రతీకారం తీర్చుకుంది. 

లియాన్ ఒక్కడే..

ఈ మ్యాచులో నాథన్ లియాన్ ఒక్కడే 11 వికెట్లు తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసుకున్న లియాన్, రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ పై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

సంక్షిప్త స్కోరు: 

మొదటి ఇన్నింగ్స్ భారత్: 109 ఆలౌట్
ఆస్ట్రేలియా: 197 ఆలౌట్ (88 పరుగుల లీడ్)
రెండో ఇన్నింగ్స్ భారత్ : 163 ఆలౌట్ (75 పరుగుల లీడ్)
ఆస్ట్రేలియా : 78/ 1