
అడిలైడ్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. స్వల్ప లక్ష్య ఛేదనలో జో బర్న్స్ (51 నాటౌట్), మ్యాథ్యూ వేడ్ (33) ఆకట్టుకోవడంతో 93 రన్స్‌ను రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బర్న్స్ అటాకింగ్ గేమ్ ఆడటంతో కంగారూల గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్‌కు ఒక వికెట్ దక్కింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 36 రన్స్‌కే కుప్పకూలిన నేపథ్యంలో ఆసీస్ ఛేజింగ్ మీద ఆసక్తి రేగింది. అయితే కంగారూ ఓపెనర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. గాయంతో పేసర్ మహ్మద్ షమి బౌలింగ్‌కు దూరమవ్వడంతో.. ఉమేశ్ యాదవ్, బుమ్రా, అశ్విన్ బౌలింగ్ చేశారు. కానీ ఆసీస్ బౌలర్లలాగా ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేదు. దీంతో విజయం సులవైంది. రెండు జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్ట్ 26న మొదలుకానుంది.