క్వాడ్ సమ్మిట్‌లో అనంతరం తాను ముగ్గురిని వ్యక్తిగతంగా కలుస్తానని ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎన్నికైన ఆంటోని అల్బనీస్ వెల్లడించారు. శనివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని స్కాట్ మారిసన్ కు బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. అధికార లిబరల్ పార్టీ పరాజయం పాలైంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ విజయం సాధించింది. లేబర్ పార్టీ నేత ఆంటోనీ తదుపరి ప్రధాని కానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షులు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిది, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలతో తాను భేటీ అవుతానని వెల్లడించారు. తమ విధానంలో కొన్ని మార్పులు ఉంటయాని, ప్రధానంగా వాతావరణ మార్పుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారిస్తామని 59 సంవత్సరాల నాయకుడు తెలిపారు. తాను.. కొంతమంది ముఖ్య సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని అల్బనీస్ పేర్కొన్నారు. అనంతరం మే 24వ తేదీన టోక్యోలో జరిగే క్వాడ్సమ్మిట్ లో పాల్గొననున్నారు.
ఇక ఎన్నికల విషయానికి వస్తే.. మొత్తం 151 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 72 స్థానాల్లో విపక్ష లేబర్ పార్టీ స్థానాల్లో విజయం సాధించగా.. మారిసన్ పార్టీ కేవలం 52 స్థానాలకే పరిమతమైంది. దీంతో ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా అల్బనీస్ ఆంటోనీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఏడుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ తన ఓటమిని అంగీకరించి...నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. 2007 తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు.. నూతన ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా నూతన ప్రభుత్వంతో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు, ఇండో - పసిఫిక్ ప్రాంతంలో ఇరుదేశాల ప్రయోజనాలపై కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
Congratulations @AlboMP for the victory of the Australian Labor Party, and your election as the Prime Minister! I look forward to working towards further strengthening our Comprehensive Strategic Partnership, and for shared priorities in the Indo-Pacific region.
— Narendra Modi (@narendramodi) May 21, 2022
మరిన్ని వార్తల కోసం : -
మరియుపోల్ సిటీని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాం
నరకానికి దారితీసే బావి.. గుట్టు తేలుస్తామంటున్న రీసెర్చర్లు
