ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీదే విజయం..ప్రధానిగా మరోసారి ఆంథోనీ అల్బనీస్

ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీదే విజయం..ప్రధానిగా మరోసారి ఆంథోనీ అల్బనీస్

ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. అధికార లేబర్ పార్టీ నేత ఆంథోనీ అల్బనీస్ తిరిగి ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత పీటర్ డట్టన్ ఓటమిని అంగీకరించారు. అధికార లేబర్ పార్టీకి 86 సీట్లు,ప్రతిపక్ష పార్టీకీ 39 సీట్లు వచ్చాయని స్థానిక పత్రికలు ప్రకటించాయి. 

లేబర్ పార్టీ విజయంతో ఆస్ట్రేలియా ప్రధానిగా తిరిగి ఆంథోనీ అల్బనీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం (మే3) శనివారం జరిగిన ఓటింగ్‌లో ఆంథోనీ అల్బనీస్ భారీ మెజారిటీతో తిరిగి ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియా చరిత్రలో 21 యేళ్ల తర్వాత ప్రధానిగా ఎన్నికైన మొదటి నాయకుడు ఆంథోని. 

ఆంథోనీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ 

ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోని అల్బనీస్ అద్భుతమైన విజయం సాధించి తిరిగి ఎన్నికైనందుకు ప్రధాని మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా పెంచుకునేందుకు ఆంథోని కలిసి పనిచేస్తామని అన్నారు. 

‘‘ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు మీరు అద్భుతమైన విజయం సాధించి తిరిగి ఎన్నికైనందుకు అభినందనలు..ఈ విజయం మీ నాయకత్వంపై ఆస్ట్రేలియన్ ప్రజల శాశ్వత విశ్వాసాన్ని సూచిస్తుంది ’’ అని ప్రధాని మోదీ X లో పోస్ట్ షేర్ చేశారు.  

ఇండో, పసిఫిక్ లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఉమ్మడిగా ముందుకెళ్లడానికి భారత్ , ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ కోరారు.