డబ్బు సాయం చేయమంటే షెల్టర్ హోమ్ మూసేసిన్రు

డబ్బు సాయం చేయమంటే షెల్టర్ హోమ్ మూసేసిన్రు

బిలాస్ పూర్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల నిర్వాకం
భోపాల్: హెచ్ఐవీబాధిత చిన్నారుల కోసం ఓ ఎన్వోజీ నడిపిస్తున్న షెల్టర్ హోమ్ ను అధికారులు బలవంతంగా క్లోజ్ చేశారు. కలెక్ట‌ర్ ఆర్డ‌ర్ వేశారని, హోమ్ ను మూసేయాలని చెప్పారు. ఆర్డ‌ర్ కాపీ చూపండని అడిగిన హోమ్ ఉద్యోగిని నెట్టేశారు. అధికా రులతో గొడవపడిందంటూ ఉల్టాకేసు పెట్టి, అరెస్టు చేయించారు. మేం ఇక్కడే ఉంటామని అంటున్నా వినకుండా అందులోని 14 మంది పిల్లలను అక్కడి నుంచి ప్రభుత్వ ఆశ్రమానికి తరలించారు. చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో జరిగిన ఈ ఘటన వివరాలు.. బిలాస్ పూర్ లో అప్నా ఘర్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థ హెచ్ఐవీ బాధిత పిల్లల కోసం ఓ ఆశ్రమం నడుపుతోంది. ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ హోమ్ లో ఇప్పుడు 4 ఏళ్ల నుంచి 18ఏళ్ల లోపున్న 14మంది పిల్లలు ఉంటున్నారు.

నెలకు దాదాపు రూ.75 వేలకుపైనే ఖర్చవుతోంది. కరోనా ఎఫెక్ట్ తో హోం నడపడం కష్టమవుతోందని, ప్రభుత్వం తరఫున సాయం చేయాలని మహిళా, శిశు సంక్షేమశాఖకు అప్లికేషన్ పెట్టామని అప్నా ఘర్ డైరెక్ట‌ర్ సంజీవ్ థక్కర్ చెప్పారు. అప్పటి నుంచే అప్నాఘర్ కు సమస్యలు మొదలయ్యాయని వివరించారు. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లో 30 శాతం తమకు ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారని చెప్పారు. దానికి తాను ఒప్పుకోకపోవడంతో షెల్టర్ హోమ్ ను తనిఖీ చేసి, రూల్స్ పాటించడంలేదని ఆరోపిస్తూ హోమ్ ను క్లోజ్ చేయాలని ప్రభుత్వానికి రిపోర్టు పంపించారని తెలిపారు. తాను అక్కడ లేని టైంలో షెల్టర్ హోమ్ ను బలవంతంగా క్లోజ్ చేశారని, అడ్డుకున్న తమ ఉద్యోగిపైనా దౌర్జన్యానికి దిగారని థక్కర్ ఆరోపించారు. కాగా, హోమ్ లో తమకు అంతా బాగుందని, తాము ఇక్కడే ఉంటామని పిల్లలు చెప్పారు. ప్రభుత్వ షెల్టర్ హోమ్లలో తాము వివక్షను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే, కలెక్ట‌ర్ ఆర్డ‌ర్ తో హోమ్ ను క్లోజ్ చేయడానికి వెళ్లిన‌ అధికారులతో అప్నా ఘర్ఉద్యోగి ప్రియాంక శుక్లా గొడవపడ్డారని పోలీసులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..
.