ఆదర్శ మహిళ ఆటో మాధురి

ఆదర్శ మహిళ ఆటో మాధురి

సికింద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన బాచారం మాధురి కుటుంబ పోషణకు సాహసమే చేస్తుది. మగవారికి దీటుగా బతుకు బండిని నెట్టుకొస్తుంది. భర్త నిస్సహాయతతో, చదువుకునే పిల్లలు కండ్లముందట మెదిలేసరికి భవిష్యత్ ఏందన్న భయం పట్టుకుంది. దాంతో తానే సరికొత్త ప్రయాణం షురూ చేసింది. పుట్టింటివాళ్లు కొనిచ్చిన ఆటో నడుపుతూ కుటుంబ భారాన్ని మోస్తుంది. రోజుకు ఖర్చులన్నీ పోను రూ.600 సంపాదిస్తూ ఆటో డ్రైవర్ గా నిలదొక్కుకుని ఆదర్శంగా నిలుస్తుంది.