ఆటో బతుకులు పోస్టర్ ​రిలీజ్

ఆటో బతుకులు పోస్టర్ ​రిలీజ్

 ఖైరతాబాద్, వెలుగు: ‘ఆటో బతుకులు’ పేరుతో ఆటో డ్రైవర్ల ప్రస్తుత పరిస్థితి, వారి జీవితాలు ఆధారంగా రూపొందించిన సీరియల్​పోస్టర్​ను సోమవారం ప్రెస్​క్లబ్​లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీరియల్​హీరో ఆటో రవికుమార్​మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. గత ప్రభుత్వంలోనూ ఆటోవాలాల పరిస్థితి ఇలాగే ఉందని, ఇంకెప్పుడు మారుతాయని ప్రశ్నించారు.

 ఆటో డ్రైవర్ల పరిస్థితిని వివరిస్తూ 100 ఎపిసోడ్ లతో సీరియల్​రూపొందించామని తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్ లో రోడ్​షోలు, 20న పెద్దపల్లిలో సదస్సు నిర్వహించి యాత్ర ముగిస్తామన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో బీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, టీజీపీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతుకూరి యాచయ్య, మధు, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.