టీకా వేస్కోకుంటే ఆటో సీజ్, ఫైన్.. ఎక్కడంటే?

టీకా వేస్కోకుంటే ఆటో సీజ్, ఫైన్.. ఎక్కడంటే?
  • డ్రైవర్లకు ఔరంగాబాద్ కలెక్టర్ వార్నింగ్

ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు కలెక్టర్ మరిన్ని చర్యలు చేపట్టారు. డ్రైవర్లు కనీసం ఒక్క డోసన్నా వేస్కోకుంటే ఆటోను సీజ్ చేయడంతో పాటు ఫైన్ కూడా విధిస్తామని హెచ్చరించారు. అలాగే టీకా వేస్కోని ప్యాసింజర్లకు టికెట్లు అమ్మొద్దని టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్లను ఆదేశించారు.

షాపులు, హోటళ్లు, వైన్స్ లలో పనిచేసే సిబ్బంది, ఓనర్లు టీకా వేస్కోకుంటే.. వాటిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ రూల్స్ ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయని సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఔరంగాబాద్ లో మొత్తం 32,24,677 మంది ఉండగా.. 64.36 శాతం మంది ఫస్ట్ డోస్, 27.78 శాతం మంది మాత్రమే సెకండ్ డోస్ వేసుకున్నారు. ఇంతకుముందు టీకా వేస్కోనోళ్లకు పెట్రోల్ పోయొద్దని పెట్రోల్ పంపులను కలెక్టర్ ఆదేశించారు. హిస్టారిక్ ప్లేసుల్లోకి ఎంట్రీ లేదని ఇటీవల కలెక్టర్​ ఆర్డర్ ఇచ్చారు.