
న్యూఢిల్లీ: ఆక్సిలో ఫిన్‌సర్వ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కోసం 'గ్లోబల్‌ఎడ్' పేరుతో ఎడ్యుకేషన్లోన్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ వర్సిటీల్లో చదువుకోవాలని అనుకునే వారికి ఇది ఆర్థికంగా మద్దతు అందిస్తుంది. ఈ లోన్స్కీమ్ ద్వారా, ఫారిన్ఎడ్యుకేషన్కు సంబంధించిన ట్యూషన్ ఫీజులు, జీవన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇతర అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు.
విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా తమ కలలను నెరవేర్చుకోవడానికి గ్లోబల్‌ఎడ్ సహాయపడుతుందని ఆక్సిలో తెలిపింది. మూడు రోజుల్లోనే లోన్ మంజూరు చేస్తామని ప్రకటించింది.