ఈ ఏడాది ఉద్యోగుల జీతాలు పైకి.. ఈ-కామర్స్, ఫైనాన్షియల్ కంపెనీల్లో ఇంక్రిమెంట్‌‌‌‌ ఎక్కువ

ఈ ఏడాది ఉద్యోగుల జీతాలు పైకి.. ఈ-కామర్స్, ఫైనాన్షియల్ కంపెనీల్లో ఇంక్రిమెంట్‌‌‌‌ ఎక్కువ

న్యూఢిల్లీ:  ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల శాలరీస్‌‌‌‌ను సగటున 8–11 శాతం పెంచనున్నాయి. ముఖ్యంగా సీనియర్ ప్రొఫెషనల్స్ కంటే జూనియర్స్ జీతాలు  ఎక్కువగా పెరుగుతాయని రాండ్‌‌స్టాడ్ ఇండియా పేర్కొంది. ఐదేళ్లలోపు అనుభవం ఉన్న ఉద్యోగుల జీతాలు సగటున 10 నుంచి 11 శాతం మేర పెరగొచ్చని తెలిపింది. ఫ్రెషర్లు, జూనియర్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెషనల్స్‌‌‌‌ను నియమించుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని,  టైర్‌‌‌‌‌‌‌‌ 1,2 సిటీలలో ఈ ట్రెండ్‌‌‌‌ ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించింది.  స్కిల్స్ ఉన్న వారి జీతాలు ఎక్కువగా పెరుగుతున్నాయని రాండ్‌‌‌‌స్టాడ్‌‌‌‌ ఇండియా సీఈఓ విశ్వనాథ్‌‌‌ పీఎస్‌‌‌‌ అన్నారు.  కంపెనీలు ఫ్రెషర్లు, జూనియర్ ప్రొఫెషనల్స్‌‌‌‌ను ముందు హైర్ చేసుకుంటున్నాయని, ఆ తర్వాత వాళ్లకు ట్రెయినింగ్‌‌‌‌ ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఈ స్ట్రాటజీ చక్కగా పనిచేస్తోందని చెప్పారు. రాండ్‌‌‌‌స్టాడ్‌‌‌‌  రిపోర్ట్ ప్రకారం, 15 ఏళ్ల కంటే ఎక్కువ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ జీతాలు ఈ ఏడాది తక్కువగా పెరగనున్నాయి. సగటున 8–9 శాతం ఇంక్రిమెంట్‌‌‌‌ ఉంటుందని అంచనా. అదే మిడ్‌‌‌‌ లెవెల్ ప్రొఫెషన్స్‌‌‌‌ అంటే 5 నుంచి 15 ఏళ్ల మధ్య అనుభవం ఉన్న ఉద్యోగుల శాలరీస్‌‌‌‌  9 నుంచి 10 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. 

స్కిల్‌‌‌‌ ఉంటే జీతం పెంపు 

ఇంటర్నెట్‌‌‌‌, ఈ–కామర్స్‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ) సెక్టార్లలోని కంపెనీలు ఉద్యోగుల జీతాలను ఎక్కువగా పెంచనున్నాయి. ఈ కంపెనీలు ఈ ఏడాది సగటున 10 –12 శాతం శాలరీ ఇంక్రిమెంట్ ఇవ్వనున్నాయి. ఈ–కామర్స్ కంపెనీలు మిడ్‌‌‌‌, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయని రాండ్‌‌‌‌స్టాడ్ ఇండియా పేర్కొంది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో టెక్నాలజీ అప్‌‌‌‌గ్రేడేషన్‌‌‌‌పై కంపెనీలు ఫోకస్ పెట్టాయని తెలిపింది.  స్కిల్‌‌‌‌ ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరిగిందని,  ఇన్నొవేషన్‌‌‌‌, రీసెర్చ్‌‌‌‌, ఆటోమేషన్‌‌‌‌కు మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ప్రయారిటీ ఇస్తున్నాయని వెల్లడించింది. బీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోనూ స్కిల్‌‌‌‌ ఉన్న ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల శాలరీస్‌‌‌‌ పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. గ్లోబల్‌‌‌‌గా సమస్యలు ఉండడంతో ఐటీ, ఐటీ  ఎనబుల్డ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ (ఐటీఈఎస్‌‌‌‌) కంపెనీల ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది 7–9 శాతం మేర పెరగొచ్చని రాండ్‌‌‌‌స్టాడ్‌‌‌‌ ఇండియా అంచనా వేస్తోంది. 

ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌  పుంజుకుంటుందని విశ్వనాథ్‌‌‌  అన్నారు. వచ్చే ఏడాది జీతాల పెంపు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. కంపెనీల అట్రిషన్‌‌‌‌ (ఉద్యోగులు జాబ్ మానేయడం)  వచ్చే 12 నుంచి 18 నెలల్లో కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటుందని అంచనా. అలానే ఈ ఏడాది కంపెనీల అట్రిషన్ రేట్‌‌‌‌ సగటున 13–14 శాతం ఉంటుందని రాండ్‌‌‌‌స్టాడ్ పేర్కొంది. 2022, 2023 లో అట్రిషన్ రేట్ 18–20 శాతం మధ్య ఉంది.  కానీ, 2020 లో నమోదైన 11–12 శాతం కంటే పైనే ఉంటుందని  అంచనా. అన్ని సెక్టార్లలోని కంపెనీలు  తమ టాప్ ట్యాలెంట్‌‌‌‌ను నిలుపుకోవడానికి భారీగా ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తున్నాయని విశ్వనాథ్‌  అన్నారు. ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే కంపెనీల వైపే ప్రొఫెషనల్స్ చూస్తున్నారని, ఫలితంగా కంపెనీలు కూడా బెటర్ కాంపెన్సెషన్స్‌‌‌‌, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అందిస్తున్నాయని  వివరించారు.