పాప్‌‌ కార్న్‌‌ నిర్మాతగా గర్వపడుతున్నా

పాప్‌‌ కార్న్‌‌ నిర్మాతగా గర్వపడుతున్నా

‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్.. ఆ తర్వాత హీరోయిన్‌‌గా ఆకట్టుకుంది. ఇప్పుడు  నిర్మాతగానూ మారింది. అవికా గోర్‌‌, సాయి రోన‌‌క్ జంట‌‌గా ముర‌‌ళి గంధం రూపొందించిన చిత్రం ‘పాప్ కార్న్’. అవికాతో కలిసి భోగేంద్ర గుప్తా నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవు తున్న సందర్భంగా అవికాగోర్ ఇలా ముచ్చటించింది.

‘తొంభై శాతం లిఫ్ట్‌‌లో జరిగే కథ ఇది. రెండు గంటల సమయం ప్రేక్షకులు నన్ను, హీరోని మాత్రమే చూస్తుండాలి. కామెడీ అయినా, ఏడుపు సీన్ అయినా మేమిద్దరమే చేయాలి. నటిగా నాకది చాలెంజింగ్‌‌గా అనిపించింది. కంటెంట్‌‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌‌ను బ్యాలెన్స్‌‌ చేస్తూ ఈ స్టోరీ రెడీ చేశారు డైరెక్టర్ మురళి. ఎక్సైటింగ్‌‌గా అనిపించి వెంటనే ఓకే చేశా. నిర్మాతని అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అందుకు ఇది పర్ఫెక్ట్‌‌ అనిపించి ప్రొడ్యూసర్‌‌‌‌గా ఫస్ట్ స్టెప్ వేశా. ఇక ‘హ్యాష్‌‌ ట్యాగ్ బ్రో’ తర్వాత సాయిరోనక్‌‌తో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. హంబుల్ పర్సన్.. అలాగే హార్డ్ వర్క్ చేస్తాడు.  షూటింగ్‌లో ప్రతిరోజూ కొత్తగా ఉండేది. సెట్లోకి వచ్చాకే సీన్‌‌ చెప్పేవారు. ఆ ప్రాసెస్‌‌ ఇంటరెస్టింగ్‌‌గా అనిపించేది. చాలా ఎంజాయ్‌‌ చేసి చేశా.  ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి కానీ సినిమాలోని ప్రతి సీన్‌‌ను ఫార్వర్డ్‌‌ చేయకుండా చూడాలి. అందుకే థియేటర్లలో విడుదల చేస్తున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఓ నటిగానే కాక నిర్మాతగా ఇలాంటి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసినందుకు గర్వపడుతున్నా. ఇకపై కూడా నిర్మాతగా కంటిన్యూ అవుతా. ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్నా. ఒకటి షూటింగ్ చేశాం, మరొకటి ప్రీ ప్రొడక్షన్‌‌లో ఉంది. భవిష్యత్తులో  డైరక్షన్‌‌ కూడా చేస్తానేమో. తెలుగులో నా కొత్త చిత్రాల గురించి త్వరలోనే అనౌన్స్‌‌మెంట్స్ వస్తాయి. హిందీలో మహేష్‌‌భట్‌‌, విక్రమ్‌‌భట్‌‌ సినిమా ‘1920’లో చేస్తున్నా. మేలో విడుదలవుతుంది’.