
అవికా గోర్ ఫిమేల్ లీడ్‌గా పోలూరు కృష్ణ రూపొందించిన వెబ్ సిరీస్ ‘వధువు’. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మించిన ఈ సిరీస్ డిసెంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అవికా గోర్ చెప్పిన విశేషాలు.
‘‘బెంగాలీ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇందు’ను తెలుగులోకి ‘వధువు’గా రూపొందించారు. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యా. ఇందులో నాది యూనిక్ క్యారెక్టర్. థ్రిల్లర్ జానర్‌లో ఇంటరెస్టింగ్‌గా సాగుతుంది. మిస్టరీ సన్నివేశాలూ ఉంటాయి. టీవీ ఆడియెన్స్‌కు నచ్చే కంటెంట్ ఇందులో ఉంటుంది. సస్పెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ చేసేప్పుడు నా వయసు పదేళ్లు.
అప్పటికి పెళ్లంటే ఏంటి, పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా వ్యవ హరించాలి అనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు. ఇప్పుడు ‘వధువు’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. పెళ్లి, వధువు అనే విషయాలు తెలుసు. ఇప్పటిదాకా నేను ఆన్ స్క్రీన్‌పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అందుకే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా చీర కట్టుకుని, హెయిర్ స్టైల్ చేసుకుని మేకప్ కావడం నాకు ఇష్టం. ఇందులోని వెడ్డింగ్ సీక్వెన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
‘మాన్షన్ 24’ వెబ్ సిరీస్‌తో పాటు ‘వధువు’లో నందుతో కలిసి నటించా. తను మంచి కో స్టార్. ఆయన ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇక నా దగ్గరకు ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మంచి లవ్ స్టోరీస్ వచ్చినా చేస్తా. నటిగా నాకు ఒకే జానర్‌లో కంటిన్యూ కావా లని లేదు. ప్రస్తుతం తెలు గులో ఆది సాయికుమా ర్ హీరోగా ఒక సినిమా చేస్తున్నా. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నా’’.