యుజీన్: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇండియా అథ్లెట్లు నిరాశ పరుస్తున్నారు. మెన్స్ 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో ఫైనల్ చేరి పతకంపై ఆశలు రేపిన అవినాశ్ సాబ్లే ఆఖరాటలో ఆకట్టుకోలేకపోయాడు. మంగళవారం ఉదయం జరిగిన ఫైనల్ రేసును సాబ్లే 8:31.31 టైమింగ్‌తో పూర్తి చేసి 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కనీసం తన పర్సనల్ బెస్ట్ టైమింగ్ (8:12.48)ని కూడా అందుకో లేకపోయాడు. ముగ్గురు మెడల్ విన్నర్లు కూడా తమ పర్సనల్, సీజన్ బెస్ట్ కంటే ఎక్కువ టైమ్ తీసుకు న్నారు. మొరాకో కు చెందిన ఒలింపిక్ చాంపియన్ బకాలి 7:58.28 టైమింగ్‌తో గోల్డ్ నెగ్గగా, యిథియోపియాకు చెందిన గిర్మా (8:25.13) సిల్వర్, కెన్యాకు చెందిన కిప్రుటో (8:08.76) బ్రాంజ్ గెలిచారు.
