వేగంగా వృద్ధి చెందుతున్న 50 స్టార్టప్లకు అవార్డులు

వేగంగా వృద్ధి చెందుతున్న 50 స్టార్టప్లకు అవార్డులు
  • ఎంట్రప్రెన్యూర్​ సమిట్​లో అందించిన టై హైదరాబాద్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న, ఆదరణ ఉన్న టాప్​ 50 స్టార్టప్​లకు టై హైదరాబాద్ అవార్డులు ప్రదానం చేసింది. హైటెక్స్​లో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఎంట్రప్రెన్యూర్​షిప్ సమిట్​లో భాగంగా ఈ అవార్డులను బహూకరించారు. ఆయా సంస్థలకు మెంటార్​షిప్, మార్కెట్ యాక్సెస్, ఫండ్ సపోర్ట్​ను అందించనున్నారు. 

టై వైస్​ప్రెసిడెంట్​ మురళీ కాకర్ల ఇనిషియేటివ్​గా తీసుకున్న ఈ అవార్డుల్లో.. టాప్10లో యాంబియేటర్ ప్రైవేట్ లిమిటెడ్, అచల హెల్త్​ సర్వీసెస్​ ప్రైవేట్​ లిమిటెడ్, అలయన్ ఇన్నొవేషన్స్, ఆల్ట్​నెక్స్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అర్థశాస్త్ర ఇంటెలిజెన్స్, అవిన్య న్యూరో టెక్ ప్రైవేట్ లిమిటెడ్, బీయేబుల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, బెనిఫిక్ న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్, బయోమీ సస్టైనబిలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయో రీఫార్మ్స్ ప్రైవేట్​ లిమిటెడ్ సంస్థలున్నాయి. 

హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాల్లో తమకంటూ ఒక ఇన్నొవేటివ్​ ఐడియాతో ముందుకొచ్చిన సంస్థలకు ఈ అవార్డులను బహష్ట్రకరించారు. రాష్ట్రంలో వర్ధమాన ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు మురళీ కాకర్ల అన్నారు. ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డులను ఏడుగురు పారిశ్రామికవేత్తలకు అందించనున్నట్టు చెప్పారు. 

మరోవైపు సోషల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డును ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కు చెందిన గుల్లపల్లి నాగేశ్వర్ రావు, ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ద ఇయర్​గా అనిల్ చలమలశెట్టి, మహేశ్ కొల్లికి ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తగా మీవీ కో ఫౌండర్ మిథులా దేవభక్తునికి అవార్డును అందించారు. హైదరాబాద్ ఏంజెల్స్ కు బెస్ట్ ఏంజెల్ నెట్ వర్క్ అవార్డును ప్రదానం చేశారు.