గీతా జూనియర్ కాలేజీలో సైబర్​ నేరాలపై అవగాహన

గీతా జూనియర్ కాలేజీలో సైబర్​ నేరాలపై అవగాహన

మెదక్ టౌన్, వెలుగు: స్టూడెంట్లు సోషల్​మీడియాలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెదక్ డీఎస్పీ సుభాష్​చంద్రబోస్ తెలిపారు. బుధవారం మెదక్​లోని గీతా జూనియర్ కాలేజీలో ‘సైబర్ జాగరూకత దివస్’ పేరుతో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. 

జిల్లా ఏఎస్పీ మహేందర్​తోపాటు సుభాష్ చంద్రబోస్​ పాల్గొని సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఫేక్ బ్యాంక్ కాల్​ఫ్రాడ్స్, డెబిట్, క్రెడిట్ కార్డ్, అడ్వర్జైజ్​మెంట్​ఫ్రాడ్స్, లోన్ యాప్ ఫ్రాడ్స్ వివరించారు. బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీఐ సురేశ్, కానిస్టేబుల్ సతీశ్, కాలేజీ కరెస్పాండెంట్ ప్రసాద్​రావు,  ప్రిన్సిపాల్​ సాయిరామ్, సెక్టోరియల్​ఆఫీసర్ సతీశ్​కుమార్ పాల్గొన్నారు.