సాఫ్ట్‌‌‌‌వేర్ డెవెలప్మెంట్ను మార్చే కొత్త ఏఐ.. ప్రవేశపెట్టిన అమెజాన్

సాఫ్ట్‌‌‌‌వేర్  డెవెలప్మెంట్ను మార్చే కొత్త ఏఐ.. ప్రవేశపెట్టిన అమెజాన్

న్యూఢిల్లీ: సాఫ్ట్‌‌‌‌వేర్  డెవెలప్​మెంట్​ను  ఈజీగా మార్చే కొత్త ఏఐ పద్ధతిని అమెజాన్​వెబ్​సర్వీసెస్​(ఏడబ్ల్యూఎస్) అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరులో జరిగిన ఏడబ్ల్యూఎస్  డెవ్​స్పియర్​ 2025 ఈవెంట్‌‌‌‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిని ఏఐ డ్రివెన్​ డెవెలప్​మెంట్​ లైఫ్​ సైకిల్ (ఏఐ-డీఎల్​సీ) అంటారు. ఈ పద్ధతి, సాఫ్ట్‌‌‌‌వేర్ డెవెలప్​మెంట్​లో ఏఐని కీలకంగా మార్చుతుంది.  

నెలల తరబడి పనిని కొద్ది రోజుల్లో లేదా గంటల్లో పూర్తి చేస్తుంది. ఏఐ-డీఎల్​సీని ఉపయోగించి, విప్రో వంటి సంస్థలు కేవలం 20 గంటల్లోనే నాలుగు ప్రొడక్షన్- రెడీ మాడ్యూల్స్‌‌‌‌ను అభివృద్ధి చేశాయి.  టెక్​ ఎక్స్​పర్టుల కోసం ఏడబ్ల్యూఎస్ ఏఐ- నేటివ్ ​బిల్డర్స్​కమ్యూనిటీ అనే కొత్త నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించింది.