యాక్సిస్​ చేతికి సిటీ బ్యాంక్

యాక్సిస్​ చేతికి సిటీ బ్యాంక్

న్యూఢిల్లీ: సిటీ బ్యాంకు ఇండియా కన్జూమర్​ బిజినెస్​ను యాక్సిస్​ బ్యాంకు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.12,325 కోట్లు ఇన్వెస్ట్​ చేసింది. రెండు బ్యాంకుల డైరెక్టర్ల బోర్డులు దీనికి ఆమోదం తెలిపాయి.  కన్జూమర్​ బిజినెస్​లో క్రెడిట్​కార్డ్స్‌​, రిటైల్​ బ్యాంకింగ్​, వెల్త్​ మేనేజ్​మెంట్​, కన్జూమర్​ లోన్​ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ డీల్​లో సిటీ బ్యాంకు నాన్​ బ్యాకింగ్​ ఫైనాన్షియల్​ కంపెనీ సిటీకార్ప్​ ఫైనాన్స్​ ఇండియా లిమిటెడ్​కూడా ఉంటుంది. ఇది కమర్షియల్​ వెహికల్​, కన్​స్ట్రక్షన్​ ఎక్విప్​మెంట్​, పర్సనల్​ లోన్లు ఇస్తుంది. ఈ డీల్​ వల్ల తమకు సంపన్న కస్టమర్ల సంఖ్య మరింత పెరుగుతుందని యాక్సిస్​ తెలిపింది. విలీనం తరువాత యాక్సిస్​ బ్యాంకు సేవింగ్​ అకౌంట్ల సంఖ్య 2.85 కోట్లకు, కార్డుల సంఖ్య 1.06 కోట్లకు పెరుగుతుంది. ఇండియాలో కన్జూమర్​ బ్యాంకింగ్​ ఆపరేషన్లను అమ్మేస్తామని సిటీ బ్యాంకు గత ఏడాదే ప్రకటించింది. మొత్తం 13 దేశాల్లో కన్జూమర్​ బిజినెస్​లను వదులుకుంటున్నట్టు తెలిపింది. యాక్సిస్​ బ్యాంకుతోపాటు కోటక్​ మహీంద్రా, ఇండస్​ఇండ్​, డీబీఎస్, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులు సిటీ బ్యాంకు కన్జూమర్​ బిజినెస్​ కొనుగోలుకు ఆసక్తి చూపాయి. సిటీ బ్యాంకు రిటైల్ బుక్​ విలువ రూ.68 వేల కోట్ల వరకు ఉంటుంది. కార్డుల మార్కెట్లో నాలుగుశాతం వాటా ఉంది.