యాక్సిస్ బ్యాంక్ లో పెరిగిన మొండిబాకీలు

యాక్సిస్ బ్యాంక్ లో పెరిగిన  మొండిబాకీలు

న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో  రూ.5,806 కోట్ల నికర లాభం సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.6,035 కోట్లతో పోలిస్తే ఇది 4 శాతం తక్కువ.  మొండిబాకీలు కొద్దిగా పెరిగాయని బ్యాంక్ పేర్కొంది. 

 మొత్తం ఆదాయం క్యూ1 లో రూ.38,322 కోట్లకు పెరిగింది.  కిందటేడాది ఇదే కాలంలో రూ.35,844 కోట్ల ఆదాయం వచ్చింది. బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం రూ.30,061 కోట్ల నుంచి రూ.31,064 కోట్లకు పెరిగింది.  

బ్యాంక్  అసెట్ క్వాలిటీ కొద్దిగా తగ్గింది. గ్రాస్ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలు) రేషియో ఈ ఏడాది జూన్ చివరి నాటికి 1.57శాతానికి చేరుకుంది. గత ఏడాది జూన్ ముగిసేనాటికి ఇది 1.54శాతంగా ఉంది.  నెట్ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏ రేషియో కూడా  0.34శాతం నుంచి 0.45శాతానికి పెరిగింది. బ్యాంక్ షేర్లు గురువారం 0.63 శాతం పడ్డాయి.