చెరువులో కరెంట్​ మోటార్లు తీసేయాలని ఆందోళన

చెరువులో కరెంట్​ మోటార్లు తీసేయాలని ఆందోళన

చొప్పదండి, వెలుగు: చొప్పదండి మండలంలోని రాగంపేట, రేవెల్లి చెరువులోని నీటిని 30 మోటార్లతో దేశాయిపేట గ్రామస్తులు రామడుగు మండలం గుండి, వెంకట్రావుపల్లి వరకు తరలించుకుపోతున్నారని రాగంపేట, రేవెల్లి, చిట్యాలపల్లికి చెందిన ఆయకట్టు రైతులు, మత్స్యకార్మికులు తహసీల్దార్​ ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు.

  ఆందోళన చేస్తున్న రైతులు, మత్స్యకార్మికులు మాట్లాడుతూ ఈ చెరువులో నుంచి నీటిని తరలించుకుపోవడం ద్వారా ఆయకట్టు పరిధిలో ఉన్న 560 ఎకరాల భూములకు నీరు అందడం లేదన్నారు. మత్స్యకార్మికులు చెరువులో రెండు లక్షల వరకు చేపపిల్లలను  వదలగా, నీరు సరిపోక చేప పిల్లలు ఎదగక చేపల వృత్తిని నమ్ముకున్న 600 మంది మత్స్య కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. చెరువులో ఉన్న మోటార్లను తొలగించి రైతులకు, మత్స్య కార్మికులకు న్యాయం చేయాలని అనంతరం తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.