సెప్టెంబర్ 9న వరల్డ్‌‌ వైడ్‌‌గా రిలీజ్

సెప్టెంబర్ 9న వరల్డ్‌‌ వైడ్‌‌గా రిలీజ్

రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాజమౌళి ప్రెజెంటర్‌‌‌‌గా ఉన్నారు. మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్‌‌ పార్ట్‌‌ ‘బ్రహ్మాస్త్రం : శివ’  పేరుతో సెప్టెంబర్ 9న వరల్డ్‌‌ వైడ్‌‌గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా నిన్న విశాఖపట్నంలో ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి మాట్లాడుతూ ‘అయాన్ కథ చెప్పిన విధానం కంటే ఆయన సినిమా మీద పెంచుకున్న ప్రేమకి నేను ఇంప్రెస్ అయ్యాను. షూటింగ్ విజువల్స్ చూసి ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్సయ్యాను. నేను ఇరవై నిమిషాలే సినిమా చూశాను. మా నాన్న మొత్తం చూసి బ్లాక్ బస్టర్ తీశాడన్నారు. ఆలియా ఇందులో ఉండటం దర్శకుడి అదృష్టం. రణబీర్ హృదయంలో ఉండటం రణబీర్ అదృష్టం’ అన్నారు. ‘ఎవరూ తీయని గొప్ప సినిమా తీయాలనేది నా ఆశ. అందుకే పదేళ్లు కష్టపడ్డాను.  చిన్నప్పటినుంచి విన్న కథలు, ప్రాచీన భారతీయ సంస్కృతి, దాని మూలాలే దీనికి ఆధారం. జూన్ 15న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం’ అన్నాడు అయాన్. రణ్‌‌బీర్ మాట్లాడుతూ ‘సౌతిండియన్ సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్‌‌ని. రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ గార్ల సినిమాలు చూస్తుంటాను. రామ్ చరణ్‌‌తో స్నేహం ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ నాకు డియరెస్ట్ ఫ్రెండ్. ఇది చాలా మంచి సినిమా. శివ పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్ అందరికీ కనెక్టవుతుంది’ అన్నాడు.