
అయోధ్యంలో 240 అడుగుల రావణుడి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిషేధించారు యూపీ పోలీసులు. రామ్ కథ పార్క్‌లో ఫిల్మ్ ఆర్టిస్ట్ రామ్లీలా కమిటీ ఆధ్వర్యంలో దసరా రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని షెడ్యూల్ఉండగా ముందస్తు సమాచారం లేదని భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయోధ్యలోని రామ్ కథ పార్క్ లో పిల్మ్ ఆర్టిస్ట్ రామ్లీలా కమిటీ ఆధ్వర్యంలో గ్రాండ్ ఫిల్మీ రామ్ లీల కార్యక్రమాన్ని గత నెలరోజులుగా నిర్వహిస్తున్నారు. చివరి ఘట్టం అయిన రావణ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం దసరా రోజు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా 240 అడుగుల రావణడి దిష్టిబొమ్మతోపాటు, మేఘనాధుడు, కుంభకర్ణుడి భారీ దిష్టి బొమ్మలను దహనం చేయనున్నారు. అయితే భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నామని అయోధ్య సర్కిల్ ఆఫీసర్ దేవేష్ చతుర్వేది చెప్పారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ముందస్తు అనుమతి పొందలేదని కూడా ఆయన ఎత్తి చూపారు. పెట్రోలింగ్ సమయంలో ఈ దిష్టిబొమ్మల నిర్మాణం గమనించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
అయితే నిర్వాహకులు మాత్రం చివరి నిమిషయంలో నిషేధం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలనుంచి కళాకారులను రప్పించి మూడు రోజులుగా వేల రూపాయలు ఖర్చు చేసి రావణుడి దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.. దసరా రోజున రావణ దిష్టిబొమ్మ దహనం చేయకపోతే అశుభం అని ఫిల్మ్ ఆర్టిస్ట్ రా మ్లీలా కమిటీ వ్యవవస్థాపక అధ్యక్షుడు సుభాస్ మాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు. రావణ దిష్టి బొమ్మ దహనానికి అనుమతివ్వాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి కి విజ్ణప్తి చేశారు.
అయోధ్యలో 'ఫిల్మీ రామ్ లీల
సెప్టెంబర్ 22న అయోధ్యలోని గ్రాండ్ 'ఫిల్మీ రామ్ లీల' రామకథ పార్క్‌లో ప్రారంభించారు. అధునాతన 3D టెక్నాలజీతో అద్భుతమైన 120 అడుగుల వేదికపై ప్రదర్శించబడిన ఈ ప్రదర్శన నారదుడి ప్రేమకు సంబంధించిన నాటకీయ ఎపిసోడ్‌తో ప్రారంభమైంది.ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రామ్ లీల అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. ఆ సమయంలో 240 అడుగుల ఎత్తైన రావణుడి దిష్టిబొమ్మ, మేఘనాధుడి, కుంభకర్ణుడి 190 అడుగుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు రాష్ట్రాల నుంచి 60 మంది కళాకారుల బృందం సాంప్రదాయ కళాత్మకతతో సాంకేతికతను మిళితం చేస్తూ భారీ దిష్టిబొమ్మలను రూపొందించారు.