అయోధ్య ఆలయ మ్యూజియం పనులు టాటా సన్స్ సొంతం

అయోధ్య ఆలయ మ్యూజియం పనులు టాటా సన్స్ సొంతం

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరానికి సంబంధించిన మ్యూజియాన్ని టాటా గ్రూప్ మాతృ సంస్థ అయిన టాటాసన్స్ అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ఆ కంపెనీ రూ.750 కోట్ల కార్పస్ కేటాయించింది. ఈ మేకరకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమెదముద్ర వేసింది.  మౌలిక సదుపాయాలకు, డిజైన్ మురియు ఇంటిరియర్ వర్క్స్ కోసం రూ.650కోట్లు ఖర్చుచేయనున్నారు. సైట్ డెవలప్ మెంట్ కు రూ.100 కోట్లు కేటాయించనున్నారు. 

రామాలయ మ్యూజియానికి అవసరమైన భూమిని ప్రభుత్వం 90ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. సరయూ నదికి సమీపంలోని మఝా జంగర అనే గ్రామంలో పర్యాటక భూమిని టాటా సన్స్ కంపెనీకి అప్పగించనున్నారు. మ్యూజియం కాంప్లెక్స్ లో 12 గ్యాలరీలు ఉన్నాయి. ఆలయ మ్యూజియం అయోధ్యను సందర్శించే పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని భావిస్తున్నారు. రామ మందిరానికి సంబంధించిన పురాతన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇప్పటికే కొన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి. కానీ దాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దలేదు.