
బాలీవుడ్ లో హారర్ కామెడీ చిత్రాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన నిర్మాణ సంస్థ మాడాక్ ఫిలిమ్స్. 'స్త్రీ', 'భేడియా', 'రూహి' వంటి బ్లాక్‌బస్టర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించింది. తన చిత్రాలతో ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించిన ఈ సంస్థ.. ఇప్పుడు తన హారర్ కామెడీ యూనివర్స్ ను సరికొత్త కథాంశంతో ముందుకు వస్తోంది. అదే బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన'థమ్మా' . ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21, 2025న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
రికార్డులు బద్దలు కొట్టేనా?
దినేష్ విజన్, అమర్ కౌశిక్ సమర్పణలో, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మాడాక్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ హారర్-కామెడీగా 'థమ్మా' తెరకెక్కింది. ఇందులో ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ కూడా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ రోజే రూ.13 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఇది మాడాక్ యూనివర్స్‌లోని మునుపటి చిత్రాలైన 'భేడియా', అలాగే ఇతర సూపర్ నేచురల్ హిట్ 'భూల్ భులైయా 2' రికార్డులను అధిగమించే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నాయి.
'థమ్మా' కథ
ఈ చిత్రం కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా 'బేతాళ్' పాత్రలో పోషించారు. ఇది భారతీయ జానపద కథల్లోని రక్తపిపాసి లాంటి ఆత్మ పాత్ర చుట్టూ తిరుగుతుంది. హాస్యం, యాక్షన్ , ఊహించని ప్రేమ మధ్య ఇరుక్కున్న ఒక సాధారణ వ్యక్తి ఈ బేతాళ్‌గా తన శక్తులను, ప్రేమను ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది కథాంశం. ఈ చిత్రంలో రష్మిక మందన్న 'తడకా' అనే పాత్రను పోషిస్తోంది. 'స్త్రీ' విజయంతో మా హారర్-కామెడీ యూనివర్స్ మొదలైంది. అప్పటినుండి మేము భారతీయ మూలాలతో, ప్రేక్షకులకు నచ్చే కథలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.
ఫాంటసీ చిత్రంగా ..
'స్త్రీ' మూవీ విజయంతో తమ హారర్-కామెడీ యూనివర్స్ మొదలైందని నిర్మాత దినేష్ విజన్ తెలిపారు. అప్పటినుండి తాము భారతీయ మూలాలతో, ప్రేక్షకులకు నచ్చే కథలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 'థమ్మా' అనేది పూర్తిగా భారతీయ జానపద మూలాల ఆధారంగా రూపొందించబడింది. పశ్చిమ దేశాల కథల కంటే మన కథల్లోనే అద్భుతమైన భావాలు, అసాధారణ అంశాలు ఉన్నాయి అని తెలిపారు. ఇది ఫాంటసీ చిత్రం. ఈ యూనివర్స్ బాలీవుడ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందినదని ఆయన అభివర్ణించారు. 'థమ్మా'లో హారర్ కంటే కామెడీ, రొమాన్స్, యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన వెల్లడించారు.
Also Read : అనుష్కతో అల్లరి పిల్లాడిలా ప్రభాస్..
'థమ్మా'లో తమ పాత్రలు భారతీయ సంస్కృతిలో బలంగా పాతుకుపోయి ఆధునిక ఆకర్షణను కలిగి ఉంటాయని రష్మిక అన్నారు. ఆ పాత్రల స్వభావం, స్టైల్ తన్ను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పింది. 'పుష్ప: ది రైజ్', 'యానిమల్' వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మిక ఈ సినిమాతో మరింత క్రేజ్ ను సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మాడాక్ ఫిలిమ్స్ యూనివర్స్‌లో భాగమైన 'స్త్రీ', 'భేడియా', 'ముంజ్యా' వంటి చిత్రాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. 'థమ్మా' కూడా అదే స్థాయిలో, ముఖ్యంగా దీపావళి వంటి పండుగ సీజన్‌లో విడుదలై, ప్రేక్షకులను అలరించి, మాడాక్ సంస్థకు మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. మరి ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి .