
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ రిలీజై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ స్పెషల్ అప్డేట్స్తో ప్రభాస్ ఫ్యాన్స్ని అలర్ట్ చేస్తున్నారు. ‘బాహుబలి’ తెరవెనుక సీన్స్, షూటింగ్స్లో బ్యూటీఫుల్ మెమొరీస్ను షేర్ చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు.
లేటెస్ట్గా అనుష్కతో అల్లరి పిల్లాడిలా మారిన ప్రభాస్ వీడియో షేర్ చేసింది టీమ్. ఇందులో ‘అనుష్క (దేవసేన) సీమంతం సీన్’ షూట్ చేసే టైంలో ప్రభాస్ చేసిన అల్లరిని చూపించారు. ప్రభాస్, అనుష్క ఒకే కుర్చీలో కూర్చుని ముచ్చటైన నవ్వుని చిందించారు. అల్లరి పిల్లాడిలా ప్రభాస్ సైగ చేయడం, హయ్ చెప్పడం వంటి క్యూట్ ఎక్సప్రెషన్స్ హైలెట్గా ఉన్నాయి.
Cuz who said Kings and Queens can't have some bloopers! 😁#BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/9wmTslDhlL
— Baahubali (@BaahubaliMovie) October 15, 2025
ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే, వీడియో షేర్ చేస్తూ, డార్లింగ్ ఫ్యాన్స్ అందమైన కామెంట్స్ పెడుతున్నారు. ‘ముచ్చటైన జంట, రియల్ లైఫ్లో కూడా ఒక్కటైతే బాగు’ అని క్యూట్ కామెంట్స్ ఇస్తున్నారు. అయితే, ప్రభాస్, అనుష్క శెట్టిల మధ్య బలమైన స్నేహం ఉందని, కానీ ప్రేమలో లేరని ప్రముఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ప్రభాస్, అనుష్క మళ్ళీ రావాలని:
సినీ ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకులలో ఒక సరికొత్త వైబ్రేషన్ కనిపిస్తుంది. అటువంటి మ్యాజికల్ కాంబినేషన్లలో ముందు వరుసలో ఉంటుంది ప్రభాస్, అనుష్కల జోడీ. ‘బాహుబలి’ సిరీస్లో వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఒక లెజెండ్‌గా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే వీరి కాంబో మళ్ళీ రావాలని ఆశిస్తున్నారు.
Also Read : దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్.. వెంకటేష్, రానా కోర్టుకు రావాల్సిందే
‘బిల్లా’ (2009), ‘మిర్చి’ (2013), బాహుబలి సిరీస్లో వీరి జంటను ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. ఈ విజయవంతమైన కలయికపై.. అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటూ వస్తున్నారు.
ఇందులో భాగంగానే, మరోసారి వీరిద్దరూ కలిసి నటించే సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉన్న ఈ విషయంపై, అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి!!