సూర్యాపేట జిల్లాలో అయ్యప్ప మాల వేసుకున్న స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ను కొట్టారని నిరసన

సూర్యాపేట జిల్లాలో అయ్యప్ప మాల వేసుకున్న  స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ను కొట్టారని నిరసన
  • పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన అయ్యప్ప స్వాములు, బజరంగ్ దళ్ సభ్యులు 
  • మాల వేసుకుంటే కొట్టారన్నది అవాస్తవం : ప్రిన్సిపాల్

 సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయ్యప్ప మాల వేసుకుని స్కూల్‌‌‌‌‌‌‌‌కు రావద్దంటూ యాజమాన్యం చెప్పడంతో పాఠశాల ముందు అయ్యప్ప దీక్షస్వాములు ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఆనంద్ విద్యా మందిర్ ఏవీఏం స్కూల్లో 9 తరగతి చదువుతున్న విద్యార్థి మహేశ్ స్వామి మాల ధరించడంతో సోషల్ క్లాస్ జరుగుతుండగా పాఠశాల హెడ్మాస్టర్ కొట్టారని ఆరోపించారు.  

విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ స్టూడెంట్ యూనియన్, అయ్యప్ప స్వామి మాలలు ధరించిన స్వాములు కొద్దిసేపు స్కూల్‌‌‌‌‌‌‌‌ ముందు ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ పై సంబంధితశాఖ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. మాల ధరించిన స్వాములను మేము పాఠశాలకు రావద్దు అన్న మాట వాస్తవం కాదన్నారు.  స్టూడెంట్ అల్లరి చేయడంతోనే మందలించామన్నారు.