ఆజంఖాన్ ఆరోగ్యం విషమం .. ఆసుపత్రిలో ట్రీట్‌‌మెంట్

ఆజంఖాన్ ఆరోగ్యం విషమం .. ఆసుపత్రిలో ట్రీట్‌‌మెంట్

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఆజంఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను  ఏప్రిల్ 17న ఉదయం నాలుగు గంటల సమయంలో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. 15 ఏళ్ల నాటి ఓ కేసులో దోషిగా తేలడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆజంఖాన్‌పై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అనర్హత వేటు వేసింది.