
బెంగళూరులో ట్రాఫిక్ నియంత్రణకు సీఎం సిద్దరామయ్య చేసిన రిక్వెస్ట్ కు విప్రో చీఫ్అజిమ్ప్రేమ్జీ తిరస్కరించారు. గురువారం ( సెప్టెంబర్ 25) సీఎం సిద్దరామయ్యకు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
బెంగళూరు ఔటర్ రింగు రోడ్డు( ORR) ట్రాఫిక్నియంత్రించేదుకు అక్కడి విప్రో క్యాంపస్ భూములను ఇవ్వాలని సిద్దరామయ్య ఇటీవల అజీమ్ ప్రేమ్ జీని రిక్వెస్ట్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తాము ఎప్పుడూ అభినందిస్తాం అయితే ట్రాఫిక్ సమస్యకు విప్రో భూములు ఇవ్వడం ఒక్కటే పరిష్కారం కాదని అన్నారు.
ప్రైవేట్ఆస్తుల ద్వారా ప్రజా రవాణ దీర్ఘకాలిక పరిష్కారం కాదు అన్నారు అజీమ్ ప్రేమ్ జీ. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సమగ్ర అధ్యయనం అవసరం అన్నారు అజీమ్ప్రేమ్ జీ.
సిలికాన్ వ్యాలీ బెంగళూరు సిటీలో ట్రాఫిక్ గురించి చెప్పనక్కర్లేదు.. బెంగళూరు ట్రాఫిక్సమస్య అంతా ఇంతా కాదు అని చెప్పడానికి ఉదాహరణలు కోకోల్లలు.. బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై వార్తలు లేకుండా ఉండే రోజు లేదంటే ఆశ్చర్యమేమీ లేదు. అలాంటి సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.. అనేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే నిపుణల సలహా మేరకు విప్రో క్యాంపస్ నుంచి వాహనాల రాకపోకలు సాగించేందుకు అనుమతి ఇవ్వాలని అజీమ్ ప్రేమ్ జీకి లేఖ రాశారు సీఎం సిద్దరామయ్య.
సిద్దరామయ్య లేఖలో ఏం రాశారు..
ORR కారిడార్ లో ట్రాఫిక్ సమస్యకు తీవ్రంగా ఉంది.. అదొక పీడకలగా మారింది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు వాహనాల రాకపోకలకు సమీపంలోని విప్రో క్యాంపస్ నుంచి ప్రవేశం కల్పించాలని సీఎం సిద్దరామయ్య అజీమ్ప్రేమ్ జీని లేఖలో కోరారు. విప్రో ద్వారా వాహనాలకు అనుమతిస్తే ORR పక్కన ఉన్న ప్రాంతాలలో 30 శాతం రద్దీ తగ్గించొచ్చని ట్రాఫిక్ అర్బన్ మొబిలిటీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. కాబట్టి విప్రో నుంచి వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలని రిక్వెస్ట్ చేశారు.
►ALSO READ | Nano Banana AI: జెమిని నానో బనానా కొత్త ట్రెండ్..దుర్గామాత పూజ, దాండియా ఫొటోల క్రియేషన్