ఇండియన్ ఫ్యామిలీ వ్యాల్యూస్‌ను ‘బాహుబలి’ ప్రమోట్ చేసింది

ఇండియన్ ఫ్యామిలీ వ్యాల్యూస్‌ను ‘బాహుబలి’ ప్రమోట్ చేసింది

హైదరాబాద్: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి–2 కన్‌క్లూజన్ థియేటర్స్‌లో రిలీజ్ అయి మూడేళ్లు కావొస్తోంది. బాహుబలి సిరీస్‌తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో నిలిచిపోయేలా కలెక్షన్స్‌తోపాటు ప్రేక్షకుల హృదయాలనూ జక్కన్న దోచుకున్నాడు.

రీసెంట్‌గా బాహుబలి మళ్లీ వార్తల్లో నిలిచింది. తమ దేశంలోని టెలివిజన్ చానల్‌లో బాహుబలి మూవీని ప్రదర్శించినట్లు ఇండియాలోని రష్యన్ ఎంబసీ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మాస్కోలో 2017లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాజమౌళి మాట్లాడిన ఓ స్పీచ్‌ను రష్యన్ ఎంబజీ తాజాగా పోస్ట్ చేసింది. ఆ స్పీచ్‌లో బాహుబలి ఇండియన్ ఫ్యామిలీ వ్యాల్యూస్‌ను ప్రమోట్ చేస్తుందని రాజమౌళి పేర్కొన్నాడు.

‘ఇండియా డీఎన్‌ఏలో కుటుంబ విలువలు ప్రధాన భాగం. ఈ ఫిల్మ్‌ (బాహుబలి)ను అన్నదమ్ములు, తల్లి–కొడుకు, భర్త–భార్య రిలేషన్స్‌కు డెడికేట్ చేస్తున్నాం. ఇండియన్ ఫ్యామిలీ వ్యాల్యూస్‌ను ప్రపంచంతో షేర్ చేసుకోవాలనేది నా లక్ష్యం. అది వర్కవుట్ అయింది. నా సినిమా కథ బేసిక్‌గా కుటుంబ విలువలతో ముడిపడింది’ అని ఆ స్పీచ్‌లో రాజమౌళి చెప్పారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన పలు ఫొటోలను రష్యన్ ఎంబసీ షేర్ చేసింది. ఫొటోల్లో రాజమౌళితోపాటు ఆయన భార్య రమ, ప్రొడ్యూసర్‌‌ శోభూ యార్లగడ్డ, ఆయన వైఫ్ లక్ష్మితోపాటు బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ గ్రోవర్ కూడా ఉన్నారు. ఆ ఈవెంట్‌లో బ్యాడ్ మ్యాన్ సినిమాను ప్రమోట్ చేయడానికి గ్రోవర్ హాజరైనట్లు ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు రష్యన్ ఎంబసీ క్లారిటీ ఇచ్చింది.