అక్టోబర్ 31న ‘బాహుబలి: ది ఎపిక్‌‌’ థియేటర్లలోకి..

అక్టోబర్ 31న ‘బాహుబలి: ది ఎపిక్‌‌’ థియేటర్లలోకి..

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన ‘బాహుబలి’ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో టీమ్ రీ యూనియన్‌‌ను ఏర్పాటు చేసి, ఇందుకు సంబంధించిన ఫొటోస్‌‌ను షేర్ చేసింది. ప్రభాస్‌‌, రానా, రమ్యకృష్ణ, రాజమౌళి సినిమాలోని ఫేమస్ డైలాగ్స్‌‌తో కూడిన ప్లకార్డులు పట్టుకుని కనిపించారు. 

నటులు సత్యరాజ్, నాజర్, రచయిత విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, డీవోపీ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, రమా రాజమౌళి,   శ్రీవల్లి, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. ఓ దశాబ్దానికి పైగా ఉన్న జ్ఞాపకాలను ఈ రీ యూనియన్‌‌ తిరిగి తీసుకొచ్చిందని టీమ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌‌’ పేరుతో అక్టోబర్ 31న థియేటర్స్‌‌లో విడుదల చేయబోతున్నారు.