కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ అజామ్

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ అజామ్

వన్డే క్రికెట్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ నెలకొల్పిన రికార్డును బాబర్ బ్రేక్ చేసి..కెప్టెన్ గా అతితక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్ల్లో 1000 రన్స్ చేశాడు. అయితే బాబర్ 13  ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఏబీ డివిలియర్స్ 18   ఇన్నింగ్స్ల్లో,  కేన్ విలియమ్సన్ 20  ఇన్నింగ్స్ల్లో, అలిస్టర్ కుక్ 21  ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. 

ఇక ముల్తాన్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన ఫస్ట్ వన్డేలో సెంచరీతో చెలరేగాడు బాబర్. వరుస వన్డే మ్యాచుల్లో బాబర్ కు ఇది మూడో సెంచరీ.అంతకుముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో రెండు సెంచరీలు చేశాడు. దీంతో వన్టే క్రికెట్ లో వరుసగా రెండుసార్లు మూడ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా బాబర్ రికార్డులకెక్కాడు. ఇక 2016 లో యూఏఈ వేదికగా వెస్టిండీస్ తోనే జరిగిన సిరీస్ లో బాబర్ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. ఇక తాజాగా బాబర్ సెంచరీతో రెచ్చిపోవడంతో పాక్ 306 భారీ లక్ష్యాన్ని చేధించి గెలుపును సొంతం చేసుకుంది.