ధోని రికార్డును సమం చేసిన బాబర్ అజామ్

ధోని రికార్డును సమం చేసిన బాబర్ అజామ్

పాకిస్థాన్ క్రికెట్  కెప్టెన్ బాబర్ అజామ్ టీమిండియా మాజీ  కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు. ఏప్రిల్ 14 శుక్రవారం రోజున న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి 20మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 88 పరుగుల తేడాతో విజయం సాధిచింది. దీంతో పాక్ జట్టుకు కెప్టెన్గా టీ 20 క్రికెట్లో 41 విజయాలను బాబర్ అందించాడు. ఈ విజయంతో ధోని రికార్డును అతను సమం చేశాడు.

ధోని 2007 నుంచి 2016  వరకు మొత్తం  72 టీ 20 మ్యాచ్ లకు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించగా ఇందులో 41 విజయాలను అందించాడు. అయితే ధోని కంటే 5 మ్యాచ్ లు తక్కువగానే ఆడిన బాబర్ అజామ్ ఆ  రికార్డును సమం చేశాడు.  న్యూజిలాండ్ జట్టుతో పాక్ ఇంకా 4 టీ20 మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్  పాక్ గెలిచిన ధోని  రికార్డును బాబర్ బ్రేక్ చేస్తాడు.

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి 20మ్యాచ్  బాబర్ కు 100టీ20మ్యాచ్ కావడం మరో విశేషం.  2019లో తొలిసారిగా పాకిస్థాన్ టీ20ఐ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న   బాబర్ 41 మ్యాచ్‌లు జట్టుకు విజయాన్ని అందించగా  21 మ్యాచ్‌ల్లో అతని జట్టు ఓటమి చవిచూసింది.

ఇక టీ20లో అత్యధిక విజయాలు అందించిన వారిలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ , మాజీ ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ అస్గర్ స్టానిక్‌జాయ్ ఫస్ట్ ప్లేసులో ఉన్నారు.