Cricket World Cup 2023: రికార్డ్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం: బాబర్ అజామ్ 

Cricket World Cup 2023: రికార్డ్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం: బాబర్ అజామ్ 

భారత్-పాకిస్థాన్ మధ్య ముఖాముఖి రికార్డులో పాకిస్థాన్ దే పై చేయి. అయితే వన్డే వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి పాకిస్థాన్ కి నిరాశ తప్పడం లేదు. 1992లో తొలిసారి మొదలైన వీరి పోరు ఇప్పటివరకు భారత అభిమానులకు ఎన్నో ముద్ర జ్ఞాపకాలను అందించింది. టోర్నీ  గెలిచినా గెలవకపోయినా పాకిస్థాన్ పై విజయం మాత్రం సాధించేవారు. వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటివరకు పాక్ కి భారత్ పై ఒక్క విజయం కూడా రాలేదు. ఆడిన 7 మ్యాచుల్లో ఓటమి చవి చూసారు. అయితే ఈ సారి ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చెప్పుకొచ్చాడు. 

రేపు(శనివారం) భారత్ తో బ్లాక్ బస్టర్ మ్యాచు సందర్భంగా ప్రెస్ తో మాట్లాడిన బాబర్ ఆజామ్ పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో ఉందని చెప్పాడు."గతంలో జరిగిన వాటిపై దృష్టి పెట్టడం నాకు ఇష్టం లేదు. రాబోయే వాటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. రికార్డులు బద్దలు కొట్టడానికే ఉన్నాయి. భారత్ పై గెలవడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాం. మా కుర్రాళ్ళ మీద నాకు నమ్మకముంది. రేపు వారు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారనే భావిస్తున్నా" అని బాబర్ చెప్పుకొచ్చాడు.

కాగా.. ఇరు జట్ల మధ్య చివరిసారిగా జరిగిన 2019 వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో 89 పరుగుల తేడాతో టీమిండియా పాక్ ని చిత్తు చేసింది. అయితే ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న పాక్.. వరల్డ్ కప్ లో వరుసగా రెండు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉంది. మరోవైపు భారత్ కూడా ఆడిన రెండు మ్యాచుల్లో కూడా గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో దాయాదుల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. రేపు (అక్టోబర్ 14) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచు జరుగుతుంది.

ALSO READ : సంజయ్ సింగ్‌కు అక్టోబర్ 27 వరకు కస్టడీ పొడగింపు