గల్లీ క్రికెట్ లా పాక్ ఫీల్డింగ్ విన్యాసాలు.. ఆటగాళ్లపై మండిపడ్డ బాబర్

గల్లీ క్రికెట్ లా పాక్ ఫీల్డింగ్ విన్యాసాలు.. ఆటగాళ్లపై మండిపడ్డ బాబర్

అంతర్జాతీయ క్రికెట్ లో ఫీల్డింగ్ ఎంత ముఖ్యం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ లో చక్కగా రాణిస్తే సగం  మ్యాచ్ గెలిచేయొచ్చు. కీలక సమయంలో ఒక్క గ్రేట్ క్యాచ్ అందుకొని మ్యాచ్ ని ప్రత్యర్థి వైపు నుంచి లాగేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ పాకిస్థాన్ ఫీల్డింగ్ మాత్రం అత్యంత చెత్తగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఫీల్డింగ్ లోపాలతో భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అంతకుమించిన చెత్త ఫీల్డింగ్ చేస్తూ ఆసియా కప్ నుండి నిష్క్రమించారు. 

మండిపడ్డ బాబర్

సాధారణంగా ఫీల్డింగ్ లోపాలు అనేవి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. అయితే పాకిస్థాన్ కి మాత్రం ఈ సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా శ్రీలంకపై నిన్న జరిగిన కీలక మ్యాచులో పాక్  ఫీల్డింగ్ విన్యాసాలు చూస్తే అస్సలు నవ్వాగదు. వీరి ఫీల్డింగ్ గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా షహీన్ అఫ్రిదీ వేసిన 37 ఓవర్లో పాయింట్ వైపు బంతి వెళితే ఎదురుగా  ఫీల్డర్ ని చూసుకోకుండానే ఓవర్ త్రో షాదాబ్ ఓవర్ త్రో విసిరాడు. దీంతో బౌండరీ దగ్గర ఉన్న ఫీల్డర్ బంతి అందించే లోపు మరో రెండు పరుగులు శ్రీలంకకు అదనంగా వచ్చాయి. 

Also Read ; ఆ ఒక్క పరుగే ఓటమికి కారణమైంది.. పాక్ ని ముంచేసిన డక్ వర్త్ లూయిస్ 

ఈ సీన్ చూసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ షాదాబ్ ని చూసి మండిపడ్డాడు. ఇక ఇదే మ్యాచులో షాహీన్ ఆఫ్రిది తన ముందే ఉన్న బంతిని పట్టలేక బిత్తర మొహం వేసాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్ ఫీల్డింగ్ వైఫల్యాల వల్లే మేము ఓడిపోయాం అని చెప్పుకొచ్చాడు. మరి ఇంత చెత్త ఫీల్డింగ్ తో పాకిస్థాన్ నెంబర్ 1 టీం ఎలా అవతరించిందో అర్ధం కావడం లేదు.