IND vs AUS Final: ఆసీస్ కెప్టెన్‌కు మెసేజ్: కోహ్లీపై రివెంజ్ తీర్చుకున్న బాబర్ అజామ్

IND vs AUS Final: ఆసీస్ కెప్టెన్‌కు మెసేజ్: కోహ్లీపై రివెంజ్ తీర్చుకున్న బాబర్ అజామ్

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసీస్ జట్టుకు తన శుభాకాంక్షలు తెలిపాడు. ఫైనల్లో మ్యాచ్ మొత్తం మీ చేతుల్లోనే ఉంది. అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసాడు. అయితే టీమిండియా గురించి ఈ బ్యాటర్ ఏమీ మాట్లాడలేదు. దీంతో బాబర్ అజామ్ ప్రతీకారం తీరిందని పాక్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఫ్యాన్స్ ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. 

ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ 20 వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో పాక్ పై ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. పాక్ విధించిన 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేజ్ చేసింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ ను అభినందిస్తూ ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పోస్ట్ చేసాడు.
   
తాజాగా భారత్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో బాబర్ ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ ను అభినందిస్తూ మెసేజ్ చేసాడు. 2022 లో విజేత  ఇంగ్లాండ్ ను అభినందిస్తూ పాక్ జట్టు గురించి స్పందించలేదు. నిన్న బాబర్ కూడా భారత్ ను పక్కన పెట్టేసాడు. దీంతో అప్పుడు కోహ్లీ చేసిన పనికి బాబర్ తన రివెంజ్ తీర్చేసుకున్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తన్నారు. 
              
ఈ ఫైనల్ లో కోహ్లీ 54 పరుగులు చేసి కీలక దశలో ఔటయ్యాడు. దీంతో భారత్ ఒక మాదిరి స్కోర్ కే పరిమితమై ఆసీస్ చేతిలో ఓడింది.     తొలుత భారత బ్యాటర్లను 240 పరుగులకే కట్టడిచేసిన కమ్మిన్స్ చేసిన కంగారూ జట్టు.. లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి విశ్వవిజేతగా అవతరించింది. ట్రావిస్ హెడ్(137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్ లు) మార్నస్ లబుషేన్( 58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) 192 పరుగుల భాగస్వామ్యంతో ఆసీస్ కు విజయాన్ని అందించారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)