
పసికందును రోడ్డుపై వదిలేసిన దారుణ సంఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. కుత్బుల్లాపూర్, అపురూప కాలనీలో రెండు రోజుల కింద పుట్టిన పసి కందును ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వదిలేసి వెళ్ళారు. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. కళ్లుకూడ తెరవని ఆ పసిబిడ్డ ఏంపాపం చేసిందని వదిలి వెళ్లారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెల్లవారు జామున 6:20 గంటలకు పసికందును గమనించిన ఓయువకుడు 100 కాల్ చేసి పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు సమాచారం వెల్లగా.. ASI పాండు నాయక్, కానిస్టేబుల్ లక్ష్మణ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పసికందును బాలనగర్ స్మైల్ టీం ఎస్సైయాదగిరి, సలీం బృందానికి అప్పగించారు. ఆరోగ్య రిత్య పాప కండీషన్ బాగా లేకపోవడంతో వెంటనే నీలోఫర్ హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ చేయించారు. తర్వాత పసికందును శిశువిహార్ ఇంచార్జ్ కి అప్పగించారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో 3 నెలల క్రితం HMT జంగల్ లోని పొదల్లో ఓ పసికందు (మగబిడ్డ)ను వదిలిన సంఘటన మరవక ముందే ఇలా జరగటం దారుణమన్నారు కాలనీ వాసులు.