బషీర్ బాగ్/హైదరాబాద్, వెలుగు : గ్రేటర్లోని వేర్వేరు చోట్ల శుక్రవారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బషీర్బాగ్ లోని విగ్రహానికి వివిధ పార్టీలకు చెందిన నేతలు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ మంత్రులు కృష్ణ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్, బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, దళిత నేతలు జేబీ రాజు, గొల్లపల్లి దయానంద్
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్, వాటర్బోర్డులో ఎండీ సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో అధికారులు బాబు జగ్జీవన్ రామ్ ఫొటోకు నివాళి అర్పించారు.