అయ్యో పాపం.. చిన్నారి

అయ్యో పాపం.. చిన్నారి

పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి... ఓ వింత వైకల్యం కారణంగా ఎంతో వేదనను చవిచూస్తోంది. 2021లో జన్మించిన ఆస్ట్రేలియాకు చెందిన ఐలా సమ్మర్ ముచాఅనే చిన్నారి బైలేటర్ మైక్రోస్టోమియా అనే వ్యాధితో బాధపడుతోంది. అరుదుగా వచ్చే ఈ వ్యాధి వల్ల ఆమె పెదాలు సాగినట్టుగా మారాయి. దాంతో ఐలా ముఖం నవ్వినట్టుగా కనిపిస్తుంది. మొదట్లో ఈ వ్యాధి గురించి వైద్యులు, ఆ తల్లిదండ్రులు చెప్పినపుడు షాక్ కు గురయ్యారు. బిడ్డ కడుపులో ఉన్నపుడే ఈ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెప్పగానే.. సిజేరియన్ కు ముందు స్కానింగ్ లో కూడా ఎలాంటి విషయం బయటపడలేదని వారు వాపోయారు. నా బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి ప్రతీ జాగ్రత్తలు తీసుకుంటున్నాను. తప్పు ఎక్కడ జరిగిందో తెలియడం లేదని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అది ఆ తల్లి అజాగ్రత్త వల్ల సమస్య కాదని వైద్యులు తేల్చి చెప్పారు.

ప్రస్తుతం ఈ చిన్నారి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఉన్న ఈ పిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అయితే వింత వ్యాధి కారణంగా ఈ చిన్నారి పాలు తాగేందుకు కూడా ఇబ్బందులు పడుతోంది. దానికి ఆమె నోరు దగ్గర పెద్దగా ఉండడమే కారణమని వైద్యులు అంటున్నారు. దానిని శస్ర్తచికిత్స చేసి, సరిచేసేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. 2007లో చేసిన ఓ సర్వే ప్రకారం ఈ విధమైన కేసులు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 14కేసులు మాత్రమే నమోదయ్యాయని సమాచారం.

 

మరిన్ని వార్తల కోసం...

బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్

ఆకట్టుకునేలా కోస్ట్ గార్డ్‌ క్యాడెట్ల కవాతు