బేబీ మూవీని చుట్టేసిన డ్రగ్స్ కేసు.. స్పందించిన డైరెక్టర్

బేబీ మూవీని చుట్టేసిన డ్రగ్స్ కేసు.. స్పందించిన డైరెక్టర్

బేబీ సినిమాలో డ్రగ్స్ ను ప్రోత్సహించేలా సీన్స్ ఉన్నాయని సీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. బేబీ మూవీలో డ్రగ్స్ సీన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో.. పోలీసులు వివరణ అడిగారని డైరెక్టర్ సాయి రాజేశ్‌ తెలిపారు. చిత్ర నిర్మాత శ్రీనివాస కుమార్(SKN)తో కలిసి ఆయన సీవీ ఆనంద్‌ను కలిశారు. 

సాయి రాజేశ్‌ స్పందిస్తూ.. "కథలో భాగంగానే ఆ సన్నివేశంలో డ్రగ్స్‌ సీన్‌ పెట్టాల్సి వచ్చిందని పోలీసులకు వివరణ ఇచ్చా. అలాంటి సన్నివేశాలు మాదాపూర్ డ్రగ్స్ కేసులో బయటకు వచ్చాయని పోలీసులు చెప్పారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని వారు సూచించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఈ విషయాలను తెలియజేయాలని కోరారు. అందుకు అడ్వైజరీ నోటీస్ ఇచ్చారని.." సాయి రాజేశ్‌ వెల్లడించారు. 

Also Read :- బేబీ సినిమాకు పోలీసుల నోటీసులు

అంతకు ముందు సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. బేబీ సినిమాలో డ్రగ్స్ ఏ విధంగా ఉపయోగించాలని దృశ్యాలు చూపించారన్నారు. అలాగే ఫ్రెష్‌లివింగ్ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాలు.. ‘బేబీ’ సినిమాలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ‘బేబీ’ సినిమా బృందానికి నోటీసులు జారీ చేస్తామని సీపీ వెల్లడించారు.