నాగచైతన్య, కొరటాల శివ కాంబినేషన్ పై క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదంటూనే..?

నాగచైతన్య, కొరటాల శివ కాంబినేషన్ పై క్లారిటీ..  ఆ వార్తల్లో నిజం లేదంటూనే..?

యువసామ్రాట్  నాగచైతన్య , దర్శకుడు కొరటాల శివ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ ఇద్దరి కలయికపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సమాజంపై ప్రభావం చూపించే సినిమాలతో  కొరటాల శివ  మంచి పేరు తెచ్చుకున్నారు. నాగచైతన్య తన నటనతో విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్నాడు. అందువల్ల వీరిద్దరి కలయికపై ఆసక్తి పెరిగింది. 

అయితే, ఈ వార్తలపై నాగచైతన్య టీమ్ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం నాగచైతన్య–కొరటాల శివ కలిసి ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు. ఈ వార్తలు పూర్తిగా అపోహలే అని వారు తెలిపారు. భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే, అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

►ALSO READ | Chai Wala: ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాసైపోతాం.. ఆకట్టుకుంటున్న చాయ్ వాలా టీజర్ డైలాగ్స్..

ఇప్పటికే నాగచైతన్య తన 24వ సినిమా "వృష కర్మ"లో నటిస్తున్నారు. ఇది కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందుతోంది. మరోవైపు, కొరటాల శివ "దేవర 2" ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో, కొరటాల శివ నాగచైతన్యతో సమావేశమైనా, అది నిర్మాతగా ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

 ఈ 'వృష కర్మ' మూవీని మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. అయితే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.