Chai Wala: ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాసైపోతాం.. ఆకట్టుకుంటున్న చాయ్ వాలా టీజర్ డైలాగ్స్..

Chai Wala: ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాసైపోతాం.. ఆకట్టుకుంటున్న చాయ్ వాలా టీజర్ డైలాగ్స్..

శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా ప్రమోద్ హర్ష తెరకెక్కిస్తున్న చిత్రం ‘చాయ్ వాలా’. రాధా విజయలక్ష్మి, వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాపుడిప్పు నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్, కామెడీ సీన్స్తో చాయ్ వాలా టీజర్ ఇంప్రెస్ చేస్తోంది. 

‘నా చాయ్ విలువ రూ.15.. అంతకన్న ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. నా విలువ పడిపోతుంది’ అంటూ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌తో ఆలోచింపజేస్తుంది. ‘ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాసైపోతామని తెలిస్తే.. ఎప్పుడో పాస్ అయ్యే వాళ్లం కదరా’ అంటూ హీరో శివ చెప్పిన డైలాగ్ కామెడీగా ఉంది. అలాగే, హీరో, హీరోయిన్ మధ్య లవ్ టాక్ బ్యూటిఫుల్ గా ఉంది. ‘నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా.. నాకు లేదు..మరి నీకు..? అందుకే నిన్ను 10 సార్లు చూసి ప్రొపోజ్ చేసిన’అనే డైలాగ్ క్యూట్ నెస్ తీసుకొచ్చింది. సినిమాలో మంచి కామెడీతో పాటు ఎమోషన్స్ ఉందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. 

ఈ క్రమంలో టీజర్ లాంచ్ ఈవెంట్ మేకర్స్ మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకున్నారు. థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఇంటికెళ్లాక కూడా ప్రేక్షకులకు వెంటాడుతూ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనెక్ట్ అయ్యే చిత్రం అవుతుందని నిర్మాత రాజ్ కందుకూరి విష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘దర్శకుడు ప్రమోద్ నాకు ‘ఉంగరాల రాంబాబు’ టైంలో పరిచయం. ఈ స్టోరీ విని ఆశ్చర్యపోయా. ఎంతో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటూనే ఎమోషన్స్ ఉన్న కథ. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.

శివ కందుకూరి మాట్లాడుతూ  ‘ప్రేక్షకులు సినిమా చూసిన వెంటనే కచ్చితంగా కాసేపు వాళ్ల తండ్రితో మాట్లాడతారు. అలాంటి ఫాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇందులో ఉంది’ అని చెప్పాడు. తెలుగులో తనకిదే తొలిచిత్రమని తేజు అశ్విని చెప్పింది. సగటు మనిషి జీవితంలో ప్రతిరోజు జరిగే సంఘటనలే తమ చిత్రమని  దర్శకుడు ప్రమోద్ హర్ష చెప్పాడు.

నిర్మాత వెంకట్ ఆర్. పాపుడిప్పు మాట్లాడుతూ ‘సినిమాలోని కొన్ని సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూశా. నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి. అందరినీ ఆకట్టుకునే సెన్సిబుల్ లవ్ స్టోరీ ఇది’ అని అన్నారు. నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి సహా టీమ్ సభ్యులంతా పాల్గొన్నారు.