చలికి వణుకుతున్న ఏనుగులు.. రగ్గులు కప్పిన సిబ్బంది

చలికి వణుకుతున్న ఏనుగులు.. రగ్గులు కప్పిన సిబ్బంది

దేశంలో చ‌లి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.  మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర‌భార‌తంలో చ‌లి తీవ్ర‌త క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో చ‌లి తీవ్ర‌త పెరిగింది. ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ డిగ్రీల‌కు ప‌డిపోతున్నాయి. కశ్మీర్ లో అయితే... నీరు కూడా గడ్డ కట్టే పరిస్థితి. జనం బయటకు రావాలంటేనే చలికి వణికిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మూగజీవాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. చలికి వన్యప్రాణులు కూడా ఇబ్బంది పడుతున్నాయి.

దీంతో ఓ జూ పార్క్ అధికారులు జూలో ఉన్న జంతువుల కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసోంలోని కజిరంగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఏనుగు పిల్లలకు జూ సిబ్బంది శాలువాలు కప్పారు. చలికి ఇబ్బందులు పడకుండా వాటిపై మెత్తటి రగ్గులు కప్పారు. అవి జారిపోకుండా తాళ్లు కూడా కట్టారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఇవి కూడా చదవండి:

చలికాలంలో పిల్లలకు ఈ ఫుడ్ పెట్టండి

జుట్టు బాగా పెరగాలంటే తలకి నూనె పెట్టాలా ?