బిడ్డను డిజైన్ చేస్తున్నారు

బిడ్డను డిజైన్ చేస్తున్నారు

ఆరేళ్ల క్రితం పెళ్లైన లత, శ్రీనివాస్‌ దంపతుల కోరికలు కూడా ఇలాగే ఉన్నాయి.ఎంతకాలం ఎదురుచూసినా వీళ్లకు సంతానం అందలేదు. చాలాకాలం ఎదురు చూసి ఫెర్టిలిటీ సెంటర్‌ కు వెళ్లారు. టెస్ట్ లు చేసి శ్రీనివాస్‌ లోనే సమస్య ఉందని వైద్యులు తేల్చారు. ఆయనలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంది. వేరొకరి (దాత) వీర్యం తోనే పిల్లలకు అవకాశం ఉందని వైద్యులు సలహా ఇచ్చారు. ఆలోచించుకుని, ఓ నిర్ణయానికి వస్తామని చెప్పి ఇంటికి పోయారు. ఇక వాళ్ల ఊహలకు రెక్కలొచ్చాయి. పుట్టబోయే బిడ్డ ఇలా ఉండాలంటూ బోల్డన్ని ఫీచర్లు చెప్పారు. అందుకు తగ్గట్లుగానే డోనర్‌ ఎర్రగా, అందమైన నల్లని కళ్లు, బాగా చదువుకుని ఉండాలని చెప్పారు. అలాంటి డోనర్‌ వీర్యమే కావాలన్నారు.దంపతులు ఊహల్లో గీసుకున్న బిడ్డ కోసం ఈ ఆప్షన్లను ఎంచుకున్నారు. మరి వాళ్ల కోరిక నెరవేరిందా?

అర్థం లేని కోరికలతో….

తొమ్మిది నెలల తర్వాత లతకు పండంటి బిడ్డ పుట్టింది. ఆమె కోరుకున్న అందంతో పుట్టింది. శ్రీనివాస్‌ కోరుకున్న తెలివి తేటలు ఆ బిడ్డలో ఉన్నాయి. ఇది తెలిసిన బంధువులు, స్నేహితులు ఇదే విధంగా ఆప్షన్లతో ఫెర్టిలిటీ సెంటర్లను సంప్రదిం చారు. జాహ్నవి, మధు ఇద్దరూ సాఫ్ట్‌‌‌‌వేర్‌ ఇంజినీర్లు. పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టలేదు. పుడతారులే అని వైద్యులను కలవలేదు. కానీ, ఇంట్లో ఒత్తిడికి ఫెర్టిలిటీ సెంటర్‌ కు పోయారు. కౌన్సెలింగ్ తర్వాత పరీక్షలు చేశారు. జాహ్నవిలో అండ కణాల ఉత్పత్తి సరిగా లేదని తేలింది. మరో మహిళ (డోనర్‌ ) అండంతో పిల్లలు కనాలని ఆ దంపతులు సిద్ధపడ్డారు. ఈ జంట కూడా అందరిలా డోనర్ ఇలా ఉండాలి, అలా ఉండాలంటూ కోర్కెల చిట్టా ముందు పెట్టారు. అందమైన మహిళ కావాలన్నారు. కోటేరులాంటి ముక్ కు, విశాలమైన నుదురు, అయిదున్నర అడుగుల ఎత్తుండాలన్నారు. అన్నిటికీ మించి మామతం మనిషే కావాలన్నారు. మా కులమే అయి ఉండాలని షరతులు పెట్టారు. ఐక్యూ లెవల్స్‌‌‌‌ ఏ స్థాయిలో ఉండాలో చెప్పారు. ఇన్ని లక్షణాలున్న బిడ్డ కావాలని ఆశపడటం సరే. ఆ లక్షణాలన్నీ ఒకే మహిళలో ఉండటం అరుదు. ఆ అరుదైన వ్యక్తులు వీర్య దానానికి సిద్ధపడటం ఇంకా అరుదు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదని వాళ్లన్నారు. మొత్తానికి డోనర్‌ దొరికింది. లత, శ్రీనివాస్‌ కు కోరుకున్న బిడ్డ పుట్టినట్టే మాకూ పుడుతుందని జాహ్నవీ దంపతులు అనుకున్నారు. తొమ్మిది నెలల తర్వాత బిడ్డ పుట్టింది. కానీ వాళ్లనుకున్న లక్షణాలన్నీ రాలేదు. జాహ్నవీ వాళ్ల నాన్న పోలికలొచ్చాయి. అందరూ తాతలాగే ఉన్నాడని చెప్పారు. తాతగారి పొట్టి ముక్ కుని చూసి అందరూ ఆ తాతనే గుర్తు చేసుకున్నారు. ఐవీఎఫ్‌‌‌‌ ద్వారా బిడ్డల్ని కోరుకున్నట్లు డిజైన్‌ చేసుకోవడం సాధ్యం కాదని అప్పుడు వాళ్లకు అర్థమయింది. అంతేకాదు ఒక్కోసారి డోనర్‌ లక్షణాలు కాకుండా వాళ్ల అమ్మా,నాన్న లేదా బంధువుల లక్షణాలు కూడా వస్తాయి. చాలా కేసుల్లో ఈ లక్షణాలున్నాయి. దాతలాగే ఉంటాడనుకోవడం భ్రమ. ముందుగా గీసుకున్నడిజైన్లన్నీ తప్పని చాలా కేసుల్లో తేలింది. అయినా ఈ అత్యాశ మాత్రం తగ్గట్లేదు. బిడ్డ ఇలా ఉండాలి, అలా ఉండాలని కపుల్స్‌ కలలుకంటున్నరు. కలల సాఫల్యం కోసం.. రంగు, రూపులో బిడ్డ ఎలా ఉండాలో ముందే చెబుతున్నారు. అలాంటి పోలికలున్నదాతల వీర్యం , అండమే కావాలని అడుగుతున్నరు. మరి వాళ్లు కోరుకున్నట్లు బిడ్డలు పుడుతున్నరా? అట్లా కోరుకోవడం మంచిదేనా? దంపతులకు మ్యాచ్ అయ్యే డోనర్నే సెలక్ట్ చేసుకోవాలని ఫెర్టిలిటీ ఎక్స్‌ పర్ట్స్ సూచిస్తున్నారు. నల్లగా ఉన్నవాళ్లకు ఎర్రగా ఉన్న పిల్లలు పుడితే బాగోదని డాక్టర్లు చెబుతున్నారు. మేము అడిగిన బేబీనే కావాలని మొండికేస్తే వారి ఇష్టానికే వదిలేస్తున్నారు. టెక్నాలజీతో పిల్లలు కావాలనుకోవడంలో తప్పులేదు కానీ.. ఇలా అత్యాశకు పోవడం తప్పం టున్నారు సామాజికవేత్తలు. పిల్లలు తల్లిదండ్రులు ఉన్నట్లు ఉంటేనే బాగుంది అంటున్నారు.

రాజీపడక తప్పదు….

దంపతులు అందివచ్చిన టెక్నాలజీతో పిల్లలు పుట్టడమే అదృష్టం . ఇలా అత్యాశకు పోకూడదు. డోనర్ అవసరమైనప్పుడే ఈ కోరికలు పుడతాయి. ఇలాంటి కోర్కెలు మంచిది కాదని వారిస్తాం. కొందరు ఎంత ఖర్చయినా భరిస్తామంటారు.. కానీ మనసు మార్చుకోరు. ఆ కోరికలకు తగిన లక్షణాలన్నీ ఒకరిలో ఉండటం కష్టం . అలాంటి వాళ్లు దొరకరు. కొంతకాలం తర్వాత వాళ్లకు సమస్య అర్థమవుతుంది. కొంత రాజీ పడతారు.

చెబితే అర్థం చేసుకుంటారు….

పిల్లలు పుట్టని దంపతుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. పిల్లలు ఇలాగే ఉండాలని కోరుకునే వాళ్లూ పెరుగుతున్నారు. దంపతుల రంగు, ఎత్తు, పోలికలను బట్టి దానికి దగ్గరగా ఉండే వాళ్లే మంచిదని చెబుతున్నాం . అలాం టి వారినే ఎంచుకునేలా చెబుతాం . కానీ కొందరు వినరు. తల్లిదండ్రుల్లా లేని పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు. అందుకు కొంచెం దగ్గరగా అయినా ఉండాలని కోరుకోవాలి. పిల్లలు ఇలాగే ఉండాలనే దంపతులకు సమస్యలు అర్ధమయ్యేలా చెప్పి, వారికి మ్యాచ్‌ అయ్యే డోనర్‌‌నే సెలక్ట్‌‌ చేస్తున్నాం .