
ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), విష్ణవి చైతన్య(Vaishnawi chaitanya), విరాజ్ అశ్విన్(Viraj ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ యూతుఫుల్ ఎంటెర్టైనర్ బేబీ(Baby). కలర్ ఫోటో సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న రచయిత సాయి రాజేష్(Sai rajesh) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బేబీ మూవీ కలెక్షన్స్ వావ్ అనేలా వసూళ్లు సాధిస్తోంది. కేవలం 6 డేస్ లో రూ.43.8 కోట్లు సాధించి సూపర్ హిట్ మూవీ గా దూసుకెళ్తోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకు యూత్ ఫిదా అవుతోన్నారు. ఇప్పటికీ కొన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. బేబీ మూవీ రూ.50 కోట్ల క్లబ్ లో చేరటం ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్.
అందమైన సన్నివేశాలు, అద్భుతమైన నటన, హృదయాన్ని హాత్తుకునే బలమైన సంభాషణలు, ఎమోషనల్ మ్యూజిక్.. కలిపి బేబీ సినిమాను అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిపాయి. ఇక బేబీ పాత్రలో నటించిన వైష్ణవి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.