బేబీ నిర్మాత SKN ఇంట విషాదం

బేబీ నిర్మాత SKN ఇంట విషాదం

టాలీవుడ్లో చిన్న సినిమాగా తెరకెక్కి..పెద్ద సక్సెస్ అందుకున్న మూవీ బేబీ(Baby). ఈ సినిమాతో నిర్మాత SKN (శ్రీనివాస కుమార్) ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే. SKN ఇంట విషాదం నెలకొంది.

ఆయన తండ్రి గాదే సూర్య ప్రకాష్ రావు అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. నేడు (జనవరి 4) సా.4 గంటలకు ఫిలిం నగర్ మహాప్రస్థానంలో అయన అంత్యక్రియలు జరుగుతాయని SKN కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులు SKN ను పరామర్శిస్తున్నారు. ఆయన తండ్రి సూర్య ప్రకాష్ రావుకు నివాళులు అర్పిస్తూ..వారి కుటంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు

మెగాస్టార్ అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నిర్మాతగా SKN..కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలకు డిస్ట్రీబ్యూటర్ గా వర్క్ చేశారు. ఇక ఆ ఆన తర్వాత పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

విజయ్ దేవరకొండ తో కలిసి టాక్సీవాలా, కలర్ ఫోటో, ప్రతి రోజు పండుగే, బేబీ మూవీస్ ను నిర్మించాడు.ఆనంద్ దేవరకొండతో తీసిన బేబీ మూవీ మంచి సక్సెస్ ను ఇచ్చింది. దీంతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారి ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. 

  • ALSO READ | సైంధవ్కు ఎలా సాధ్యం : నోట్లో బుల్లెట్.. కింద నుంచి అలా ఎలా?