జులైలో బేబీ

జులైలో బేబీ

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌‌‌‌తో పాటు మూడు పాటలను విడుదల చేసిన మేకర్స్,  తాజాగా రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. జులై రెండో వారంలో విడుదల చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించారు. టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ముఖ్యంగా ఇటీవల రష్మిక మందన్న లాంచ్ చేసిన ‘ప్రేమిస్తున్నా’ అనే బ్రేకప్‌‌ సాంగ్‌‌ యూత్‌‌కు బాగా కనెక్ట్ అయ్యిందన్నారు నిర్మాతలు.  త్వరలోనే నాలుగో పాటను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.