"లెహరాయి" నుండి మరో సాంగ్ రిలీజ్

"లెహరాయి" నుండి మరో సాంగ్ రిలీజ్

రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా "లెహరాయి"  మూవీ నుండి "బేబీ ఒసేయ్ బేబీ" పాట విడుదల చేశారు. రామకృష్ణ పరమహంసని దర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బెక్కెం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ నిర్మాణ సంస్థ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ధ‌ర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ కీలకపాత్రలు పోషిస్తుననారు. 

వినూత్నంగా బహుభాషలు గుర్తుకొచ్చేలా ఉన్న ఈ చిత్ర టైటిల్ చాలా పాపులర్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ కు, పాటలకుకు విశేష స్పందన లభించింది. మంచి బ్రేకప్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ మూవీతో ‘జీకే ఈజ్ బ్యాక్’ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ మంచి బ్రేకప్ తో  స్టార్ట్ చేసినట్లే. ఇదివరకే ఈ సినిమా నుండి విడుద‌లైన ‘గుప్పెడంత’ పాట మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసింది.

ఇదే టెంపోను కొనసాగించేలా ‘లెహ‌రాయి’ చిత్రం మేకర్స్ ఇప్పుడు "బేబీ ఒసేయ్ బేబీ" అనే మరో  సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు. గేయ రచయిత కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటని సాకేత్, కీర్తన శర్మ   ఆల‌పించారు. ఉత్సాహభరితమైన పాటలను రాసే శ్యామ్ ఈ పాటను కూడా అదే తరహాలో రాశారు. 

"గాడి మీద కూసోబెట్టి ఊరు మొత్తం తిప్పుతుంటే
జోడి మస్తు గున్నదంటూ సూసినోళ్లు మెచ్చబట్టే...
లేడీపిల్ల దుమ్కినట్టు  జోరుమీద నువ్వు ఉంటే
ఏడికంటె ఆడికొచ్చి దాడిచెయ్య బుద్ధిపుట్టే
దూరమెంత ఉన్నాగాని దారమల్లె చుట్టేస్తా" 
లాంటి  లైన్స్ మరోసారి కాసర్ల శ్యామ్ మార్క్ ను గుర్తుచేస్తాయి.

ఈ సినిమాలో మొత్తం 7 పాటలతో మ్యూజికల్ థ్రిల్లర్ అనిపించేలా మంచి ఫీల్ వున్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస తెలిపారు. టాలీవుడ్  ప్రముఖులు న‌టించిన ‘లెహరాయి’ రిలీజ్ డేట్ ను  త్వరలోనే అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 

నటీనటులు: రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ,సత్యం రజెష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.

సాంకేతిక నిపుణులు

సమర్పకులు:  బెక్కం వేణుగోపాల్ 

బ్యానర్: ఎస్ ఎల్ ఎస్ మూవీస్   

నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్ 

రైటర్, డైరెక్టర్: రామకృష్ణ పరమహంస 

మ్యూజిక్: జీకే (ఘంటాడి కృష్ణ) 

డి.ఓ.పి: ఎం ఎన్ బాల్ రెడ్డి

ఎడిటర్: ప్రవీణ్ పూడి 

లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ , శ్రీమణి 

ఫైట్ మాస్టర్: శంకర్ 

కొరియోగ్రాఫర్స్: అజయ్ సాయి

రైటర్: పరుచూరి నరేష్ 

పి ఆర్.ఓ: ఏలూరు శీను, మేఘశ్యామ్