బేబీకి 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

బేబీకి 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

గత ఏడాది చిన్న చిత్రాల్లో ఒకటిగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీ మరో హిస్టారిక్ ఫీట్ సాధించింది.

తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. 8 నామినేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదు అవార్డ్స్ గెలుచుకుంది. ఈ సందర్భంగా  సోమవారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమ్ అంతా పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.