బచ్చల మల్లి చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

బచ్చల మల్లి చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బచ్చల మల్లి’.  హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.  ‘సోలో బ్రతుకే సో బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ సుబ్బు దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంగళవారం విడుదల చేశారు.  రిక్షాపై కూర్చొని సిగరెట్ తాగుతూ మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెటప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించాడు నరేష్.  బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాతర సెటప్ కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన  స్టిల్ ఇదని అర్థమవుతోంది.  

నరేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా అమృత అయ్యర్ నటిస్తోంది.  రావు రమేష్, రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్.  నైంటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీ ప్రస్తుతం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో షూటింగ్ జరుగుతోంది.