బ్యాచిలర్ చికెన్ బిర్యానీ : షాక్ లో కస్టమర్లు.. మోనార్క్ ఐడియా కదా

బ్యాచిలర్ చికెన్ బిర్యానీ : షాక్ లో కస్టమర్లు.. మోనార్క్ ఐడియా కదా

చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారా.. సహజంగా మనకు కనిపించే క్వాంటిటీ కాలంలో సింగిల్, డబుల్, ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్ ఇలా ఉంటాయి. ఓ రెస్టారెంట్ మాత్రం బ్యాచిలర్ అంటూ స్పెషల్ గా మెన్షన్ చేసింది. దీంతో షాక్ అయ్యారు నెటిజన్లు. ఓ రెస్టారెంట్ కు వచ్చిన ఐడియా ఇప్పుడు నెటిజన్ల ఆకర్షిస్తుంది. 

క్వాంటిటీ (ఎంత మోతాదు) అనే దానికి బ్యాచిలర్ అంటూ రాయటం వెనక కొత్త ఐడియా ఉందని కొందరు అంటున్నారు. బ్యాచిలర్స్ కు ఇది బాగా వర్కవుట్ అవుతుంది. ఎప్పుడూ సింగిల్, ఫ్యామిలీ అంటూ బ్యాచిలర్స్ ను ఎవరూ గుర్తించటం లేదు.. ఈ రెస్టారెంట్ వాళ్లు మమ్మల్ని గుర్తించారంటూ కొందరు బ్యాచిలర్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ మోనార్క్ ఖాతాలో బిర్యానీకి ఇది విచిత్రమైన  కొలత యూనిట్ అని కామెంట్ చేశారు.  మరొకరు స్క్రీన్ షాట్ ను షేర్ చేసి ఇది బ్యాచిలర్ కొలత అన్నారు.  ఇంకొకరు ఇది బ్రహ్మచారికి మాత్రమేనా.. కోడి బ్రహ్మచారి కాదా సరదాగా ప్రశ్నించారు.  అయితే ఈ రెస్టారెంట్ కొత్త కాన్సెప్ట్ ను కొంతమంది మెచ్చుకుంటుంటే.. మరికొందరు షాక్ కు గురవుతున్నారు. 

]

ఇప్పటి వరకు మార్కెట్లో బిర్యానీ క్వాంటిటీ సింగిల్, డబుల్, ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్ ఇలా ఉంటాయి.  ఇప్పుడు వీటి సరసన బ్యాచిలర్ బిరియానీ చేరింది.   ఇప్పటి  వినియోగదారులు ఎక్కువమంది  తమఫ్యామిలీ ప్యాక్  బిర్యానీనే బుక్ చేశారని పలు ఫుడ్ డెలివరీ సంస్థలు చెబుతున్నాయి.   బిర్యానీ.. ఆ పదం వింటే ఉవ్విళ్లూరుతాయి. బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అకేషన్ అయినా.. ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్లినా.. ఫ్యామిలీతో కలిసి హోటల్‌కు వెళ్లినా.. హాలిడేని ఇంట్లో ఎంజాయ్ చేసినా.. ముందుగా తినడానికి ప్రాధాన్యత ఇచ్చే ఫుడ్ బిర్యానీ. బిర్యానీ అంటే అంత స్పెషల్ మరి. రకరకాల బిర్యానీలు ఉన్నప్పటికీ ముందుగా అందరి నోట పలికేది చికెన్ బిర్యాని. ఈ విషయాన్ని మేము మాత్రమే కాదండోయ్.. ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ లు కూడా  ధృవీకరించాయి. ఇప్పుడు బ్యాచిలర్ బిర్యానీ అందుబాటులోకి రావడంతో ఇక జనాలు దానికే మొగ్గు చూపుతారని చెబుతున్నారు.  ఎంతైనా బ్రహ్మచారి టేస్టే వేరు కదా  మరి..