దుబాయ్ నుంచి వచ్చి భార్యను చంపాడు.. ఆ తర్వాత ఆత్మహత్య వెనక మిస్టరీ ఏంటీ..?

 దుబాయ్ నుంచి వచ్చి భార్యను చంపాడు.. ఆ తర్వాత ఆత్మహత్య వెనక మిస్టరీ ఏంటీ..?

ఎం కష్టం వచ్చిందో  తెలీదు... బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన ఒకతను ఒక్కసారిగా ఉన్నట్టుండి దేశానికి వచ్చి ప్రాణాలు వదిలాడు. పెళ్లిచేసుకున్నాక డబ్బు సంపాందించి కుటుంబంతో హాయిగా జీవించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడో.. కానీ  ఒక్కసారిగా దుబాయ్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన అతను ఆదివారం తన భార్యను చంపి, ఆత్మహత్య చేసుకున్నాడు. 

పోలీసుల ప్రకారం 30 ఏళ్ల ధర్మశీలం దుబాయ్‌లో మేస్త్రీగా పనిచేస్తుంటాడు. అతని 27 ఏళ్ల భార్య మంజు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఈ జంట సెప్టెంబర్ 2022లో వివాహం చేసుకున్నారు, కానీ పిల్లలు లేరు. మంజు తన తండ్రి పెరియస్వామితో కలిసి అద్దె ఇంట్లో ఉంటుంది. 

ఏమైందో ఏమోగాని ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో పెరియస్వామి కూతురు మంజు, ధర్మశీలం దంపతుల మృతదేహాలను చూసి షాకయ్యాడు. మంజు కత్తిపోట్ల గాయాలతో మంచం మీద పడి ఉండగా, ధర్మశీలం నైలాన్ తాడుతో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన  కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.